జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపునకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో మంగళవారం నుంచి ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నెల 18వ తేదీ దరఖాస్తుల స్వీకరణకు తుది గడువుగా ప్రకటించారు. కాగా, మొదటి రోజు మద్యం దుకాణాలకు దరఖాస్తులేమీ రాలేదని వెల్లడించారు. 2021-23 కొత్త ఎక్సైజ్ పాలసీ మార్గదర్శకాల మేరకు సోమవారం లాటరీ పద్ధతిన గౌడ్లు, ఎస్సీలు, ఎస్టీలకు మద్యం దుకాణాలను కేటాయించారు. కొత్తగా మంజూరైన 7 షాపులతో జిల్లాలో 63 షాపులు ఉన్నాయి. ఇందులో 22 దుకాణాలు గౌడ్లు, ఎస్సీలు, ఎస్టీలకు కేటాయించినట్లు ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ జిల్లా అధికారి పైడిపల్లి శ్రీనివాసరావు ప్రకటించారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నర్సంపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 25 దుకాణాలు, పరకాలలో 22, వర్ధన్నపేట పరిధిలో 16 ఉన్నాయని తెలిపారు. హనుమకొండ నిట్ సమీపంలోని మయూరి గార్డెన్ లేన్‌లో ఉన్న ఎక్సైజ్ శాఖ జిల్లా సూపరింటెండెంట్ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 20న ఉదయం 11 గంటలకు కలెక్టర్ బీ గోపి ఆధ్వర్యంలో లాటరీ పద్ధతిన మద్యం దుకాణాలు కేటాయిస్తామని ఆయన పేర్కొన్నారు. నూతన ఎక్సైజ్ పాలసీలో ప్రభుత్వం మద్యం లైసెన్సుదారులకు పలు బెనిఫిట్స్ ఇచ్చినట్లు తెలిపారు. గతంలో ఒక మద్యం దుకాణానికి ఒకరు ఒక దరఖాస్తు మాత్రమే చేసే అవకాశం ఉండేదని, ఈసారి ఒక దుకాణానికి ఎన్ని దరఖాస్తులైనా అందజేసే వెసులుబాటు కల్పించిందని వెల్లడించారు.
వరంగల్, నవంబర్ 9(నమస్తేతెలంగాణ): జిల్లా లోని 63 మద్యం దుకాణాల్లో గౌడ్లు, ఎస్సీలు, ఎస్టీల కు 22 కేటాయించినట్లు ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ జిల్లా అధికారి పైడిపల్లి శ్రీనివాసరావు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ఎక్సైజ్ అధికారులు లాటరీ పద్ధతిన వారికి మద్యం షాపులు కేటాయించగా, మంగ ళవారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ సంద ర్భంగా శ్రీనివాసరావు తన కార్యాలయంలో మీడియా తో మాట్లాడారు. ప్రభుత్వం తొలిసారి మద్యం దుకా ణాల్లో గౌడ్లకు 15, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5 శాతం కేటాయించేందుకు నిర్ణయించడం గమనార్హం. జిల్లా లోని నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో 63 మద్యం దుకాణాలు ఉంటే గౌడ్లు, ఎస్సీ లు, ఎస్టీలకు 22 కేటాయించగా, మిగిలిన 41 ఓపెన్ కేటగిరీలో ఉన్నట్లు శ్రీనివాసరావు వెల్లడించారు. గౌడ్ లు, ఎస్సీలు, ఎస్టీలు ఓపెన్ కేటగిరిలోని మద్యం దుకా ణాలకూ దరఖాస్తు చేయవచ్చని స్పష్టం చేశారు.
కొత్త వైన్‌షాపులు ఇవే..
ప్రభుత్వం ఈసారి కొత్తగా జిల్లాకు ఏడు మద్యం దుకాణాలు మంజూరు చేసింది. గతంలో వరంగల్ రూరల్ జిల్లాలో 56 మద్యం షాపులు ఉండేవి. వీటి తోపాటు కొత్తగా మంజూరైన దుకాణాలను కలిపితే జిల్లాలో వైన్‌షాపుల సంఖ్య 63కు చేరింది. కొత్తగా నడి కూడ మండల కేంద్రం, ఖానాపురం మండలం అశోక్ నగర్, చెన్నారావుపేట, రాయపర్తి, శాయంపేట, పర్వత గిరి మండలం అన్నారంషరీఫ్, దుగ్గొండి మండలం గిర్నిబావి గ్రామంలో ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చే యనున్నట్లు ఎక్సైజ్‌శాఖ జిల్లా అధికారులు తెలిపారు. కాపులకనపర్తి, జాన్‌పాక, దుర్గంపేట, దామెర, ధర్మా రం, కొనాయిమాకుల మద్యం దుకాణాలు రూ.85 లక్షల స్లాబులో, చెన్నారావుపేటలోని 3, అన్నారంషరీ ఫ్లోని 2, గిర్నిబావిలోని 2, నడికూడ, తహరాపూర్, మచ్చాపూర్, దుగ్గొండిలోని ఒక్కోషాపు రూ.50 లక్షల స్లాబులో ఉండగా, మిగతా 46 మద్యం దుకాణాలు రూ.55 లక్షల స్లాబులో ఉన్నట్లు శ్రీనివాసరావు ప్రక టించారు. జిల్లాలోని 63 వైన్‌షాపుల్లో 25 నర్సంపేట, 22 పరకాల, 16 వర్ధన్నపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఉన్నాయని తెలిపారు.
18వరకు దరఖాస్తుల స్వీకరణ
జిల్లాలోని 63 మద్యం దుకాణాలకు మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఎక్సైజ్ జిల్లా అధికా రి చెప్పారు. హనుమకొండ నిట్ సమీపంలోని మ యూరి గార్డెన్ లేన్‌లో ఉన్న ఎక్సైజ్ శాఖ జిల్లా సూపరిం టెండెంట్ కార్యాలయంలో మంగళవారం నుంచి దర ఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. నర్సంపేట, పరకా ల, వర్ధన్నపేట ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలోని వైన్‌షాపుల కోసం స్టేషన్ వారీగా మూడు కౌంటర్లు ఏర్పాటు చేశా మని, దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటలుగా శ్రీనివాసరావు వెల్లడించారు. 14వ తేదీ ఆదివారం సెలవు దినం మి నహా మిగతా రోజుల్లో ఉదయం 11 నుంచి సాయం త్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, ఎక్సైజ్‌శాఖ జిల్లా సూపరింటెండెంట్ కార్యాలయంతో పాటు హైదరాబాద్‌లోని ఆబ్కారీ భవన్లో కూడా జిల్లాలోని మద్యం దుకాణాలకు దరఖాస్తులు అంద జేయవచ్చని స్పష్టం చేశారు. డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ వరంగల్ రూరల్ పేర దరఖాస్తు ఫీజు రూ.2 లక్షలు డీడీ లేదా చలాన రూపంలో చెల్లించాలని తెలి పారు. దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిశాక ఈ నెల 20న ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్ బి గోపి ఆధ్వర్యంలో దరఖాస్తుదారుల సమక్షంలో లాటరీ పద్ధతిన 63 మద్యం దుకాణాల కేటాయింపు జరుప నున్నట్లు ఎక్సైజ్‌శాఖ జిల్లా అధికారి చెప్పారు.
వ్యాపారులకు బెనిఫిట్స్
డిసెంబర్ ఒకటి నుంచి ప్రారంభమయ్యే రెండేళ్ల నూతన ఎక్సైజ్ పాలసీలో ప్రభుత్వం మద్యం లైసెన్సు దారులకు పలు బెనిఫిట్స్ ఇచ్చినట్లు శ్రీనివాసరావు తెలిపారు. గతంలో ఒక మద్యం దుకాణానికి ఒకరు ఒక దరఖాస్తు మాత్రమే చేసే అవకాశం ఉండేదని, ఈ సారి ఎన్ని దరఖాస్తులైనా అందజేసే వెసులుబాటు ప్ర భుత్వం కల్పించిందని వెల్లడించారు. లైసెన్సు ఫీజు చె ల్లించే విధానం 4 ఇన్స్టాల్మెంట్స్ నుంచి ఆరుకు పెంచడం, టర్నోవర్ ట్యాక్స్ రిలాక్సేషన్ 7 నుంచి 10 రెట్లకు పెంపు, బ్యాంకు గ్యారంటీ మొత్తాన్ని 50 నుంచి 25 శాతానికి తగ్గించడం వంటివన్నీ వ్యాపారులకు బెని ఫిట్స్ చేసేవిగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఏఈఎస్ కరంచంద్, పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు జగన్నాథరావు, రాజసమ్మయ్య, పవన్‌కు మార్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
ఎవరెవరికి ఏవేవి..
గౌడ్లకు నర్సంపేటలోని 9, నల్లబెల్లిలోని 1, నెక్కొండలోని 1, 2, 3, పరకాలలోని 4, 7, శా యంపేటలోని 2, వర్ధన్నపేటలోని 1, రాయపర్తిలోని 1వ నెంబర్, నడికూడ మండల కేంద్రం, ఖా నాపురం మండలం అశోక్‌నగర్, వర్ధన్నపేట మం డలం ఇల్లంద, గీసుగొండ మండలం మచ్చాపూర్. ఎస్సీలకు నర్సంపేటలోని 5, నల్లబెల్లిలోని 2, రా యపర్తిలోని 3, పరకాలలోని 8వ నెంబర్, దామెర మండలం దుర్గంపేట, సంగెం మండలం కాపుల కనపర్తి, ఎస్టీలకు పరకాలలోని 1, శాయంపేటలోని 1వ నెంబర్ వైన్‌షాపును కేటాయించారు.