బచ్చన్నపేట, డిసెంబర్2: పల్లె పార్కు చూడముచ్చటగా ఉంది. వివిధ రకాల పూలమొక్కలు, పిల్లలు ఆడుకునేందుకు వీలుగా సౌకర్యాలు, చిన్నచిన్న రాళ్లతో ఆకర్షణీయంగా గీసిన చిత్రాలతో రాక్‌గార్డెన్ అందరినీ ఆకట్టుకుంటున్నది. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం వీఎస్ఆర్(వంగ సుదర్శన్‌రెడ్డి) నగర్లో ఏర్పాటు చేసిన ప్రకృతి వనం సిటీ పార్కును తలపిస్తున్నది.
పాలకవర్గం కృషితో..
కొత్తగా ఏర్పడిన గ్రామపంచాయతీ పాలకవర్గం కృషితో వీఎస్ఆర్నగర్లో పల్లెప్రకృతి వనం అద్భుతంగా తయారైంది. సర్పంచ్ కోనేటి స్వామి, పంచాయతీ కార్యదర్శి రుబీనా, గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ కాలియ చిట్టిబాబుల ఆలోచనలు తదితరుల సలహాల మేరకు పల్లె ప్రకృతి వనాన్ని ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ అక్కడికి వచ్చి వావ్.. రాక్‌గార్డెన్ అంటూ సెల్ఫీలు దిగుతూ సరదాగా గడుపుతున్నారు.