హైదరాబాద్, ఆగస్టు18(నమస్తే తెలంగాణ) : వనపర్తి కాంగ్రెస్ నేతల మధ్య వివాదం ముదిరింది. సీనియర్ నేత, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జీ చిన్నారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మధ్య నెలకొన్న విభేదాలు రాష్ట్ర కాంగ్రెస్ అగ్రనేతల వద్దకు చేరాయి. గోపాల్‌పేటలో చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన ఎమ్మెల్యే మేఘారెడ్డి.. ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మ న్, ఎంపీ మల్లు రవికు మంగళవారం ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన విచారణ జరిపి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మేఘారెడ్డి సీఎం రేవంత్‌రెడ్డి, మీనాక్షీనటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు ఫిర్యాదు చేశారు.