e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 18, 2022
Home News మారబోతున్న బతుకులు

మారబోతున్న బతుకులు

  • గామాలకే తిరిగి వలసలు
  • స్వీయపాలనలో అభివృద్ధి పరుగులు
  • సాగు,తాగునీటితో భరోసా
  • డబుల్‌ బెడ్రూం ఇండ్లతో ఆత్మగౌరవం
  • గిరిజనుల స్వయం పాల

వనపర్తి, అక్టోబర్‌ 24(నమస్తే తెలంగాణ): ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం, ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ చేపట్టిన అభివృద్ధి పథకాలు ఇక్కడి ప్రజల బతుకులను మార్చివేశాయి. ఏటా ఇండ్లకు తాళాలు వేసి వలసవెళ్లే ఇక్కడి మనుషులు ఇప్పుడు పుట్టినగడ్డను వీడనంటున్నారు. ఉన్న ఊరిలో సకల సౌకర్యాలు ఉండగా పరాయి దేశం వలస వెళ్లబోమని స్పష్టం చేస్తున్నారు.

మ్రారుతున్నబతుకులు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో జరిగిన ఈప్రాంతంలో కనీవినీ ఎరుగని అభివృద్ధి జరిగింది. బీడు భూములు సస్యశ్యామలమయ్యాయి. నడవడానికి దారిలేని తండా లు, గ్రామాలు రోడ్లు వేయబడి కనెక్టివిటీ పెరిగింది. సాగునీరు లేని ప్రాంతాలు ఇప్పుడు రెండు పంటలకు సరిపడా నీరు సమృద్ధిగా లభిస్తున్నది, సీసీరోడ్లు, పల్లె ప్రకృతి వనాలు, సీసీరోడ్లు, మిషన్‌ భగీరథ పథకం, వైకుంఠధామాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి సీమాంధ్ర పాలకుల చేతుల్లో ఛిద్రమై పోయిన బతుకులకు కేసీఆర్‌ అమలు చేసిన పథకాలు జీవం పోశాయి. వనపర్తి జిల్లా ఖిల్లాఘణపూర్‌ మండలం ఒకప్పుడు నిర్లక్ష్యానికి వెనుకబాటుతనానికి కేరాఫ్‌ అడ్రస్‌ ఉండగా ప్రస్తుతం డెవలప్‌మెంట్‌కు రోల్‌మోడల్‌గా నిలిచింది.

- Advertisement -

వలసల నుంచి స్వగ్రామానికి ..

నీరు లేక కూటికి ఇబ్బంది పడ్డ ఇక్కడి రైతులు ముంబాయి, గుజరాత్‌,కర్ణాటక, తమిళనాడు, దుబాయి వంటి నగరాలకు బతుకు దెరువు కోసం వలస వెళ్లేవారు. పిల్లలను ముసలి తల్లిదండ్రుల వద్ద వదిలిపెట్టి భార్యభర్తలు బతుకుదెరువు వెతుక్కుంటూ ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు, గ్రామాల్లో , తండాల్లో ఖాళీ ఇండ్లు దర్శనమిచ్చేవి. 70 శాతం ఇండ్లకు తాళాలు పడేవి. ఎకరా భూమి రూ.15 నుంచి రూ.30 వేలు పలికేది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన పథకాలతో సాగు నీరు వచ్చి రెండు పంటలు పండుతూ ఒక్కో ఎకరం ఏరియాను అనుసరించి కోటి రూపాయల నుంచి రూ.15లక్షల వరకు పలుకుతున్నది. అసలు సాగుభూమి అమ్మే రైతులు కనబడటం లేదు. వలసలు తగ్గి ఇప్పుడు గ్రామాలు తండాలు కళకళలాడుతున్నాయి. తండాలను పంచాయతీలుగా మార్చడంతో గిరిజనుల్లో చాలా మంది సర్పంచులుగా, ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా ఎన్నికై ప్రజాప్రతినిధులయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో సాధ్యం కాని ఈ పరిస్థితి తెలంగాణలో సాధ్యమైంది.కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని గుడిపల్లి లిప్టు-3 ప్రధాన కాలువను అనుసరించి ఖిల్లాఘణపూర్‌ బ్రాంచి కెనాల్‌ను ప్రభుత్వం జీవో నెంబర్‌ 141 ద్వారా మంజూరు చేసింది. కేఎల్‌ఐ ప్రాజెక్టుకు 25 టీఎంసీలు మాత్రమే వరద జలాలు కేటాయించగా,ఈ జీవో ద్వారానే 40టీఎంసీలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. గతంలో సమైక్య పాలకులు 1984లో ఎంజీకేఎల్‌ఐ ప్రస్తావన తెచ్చినప్పటికీ 2004వరకు సర్వేల పేరుతో కాలయాపన చేశారు. 2004లో జలయజ్ఞం పేరుతో 25టీఎంసీల నీటిని కేటాయించి 2లక్షల 50వేల ఎకరాల ఆయకట్టుతో పనులను ప్రారంభించారు. ఆయకట్టును అంచెలంచెలుగా పెంచిన సమైక్యపాలకులు 3లక్షల40 వేల ఎకరాలకు తీసుకెళ్లారు. రెండున్నర లక్షల ఎకరాల లక్ష్యానికి తగ్గట్టుగా ఉన్న 25 టీఎంసీల నీటి కేటాయింపులను మాత్రం ఆయకట్టు భారీగా పెరిగినా ఎవరూ పట్టించుకోలేదు. ఈ లోపాన్ని గుర్తించిన మంత్రి నిరంజన్‌రెడ్డి కేఎల్‌ఐ నీటి కేటాయింపులను పెంచడంలో తనదైన శైలిలో కృషి చేశారు. అదనపు ప్రాంతానికి సాగునీటి వవనరులను పెంచుతున్న క్రమంలో 40టీఎంసీలను కేటాయించింది. అలాగే ఖిల్లాఘణపూర్‌ బ్రాంచి కెనాల్‌కు రూ.105 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసి 2016 సెప్టెంబర్‌లో టెండరు ప్రక్రియను కూడా పూర్తి చేసి పనులకు శ్రీకారం చుట్టడంతో ఇప్పుడు ఎటు చూసినా పచ్చని పొలాల అందాలు కనువిందు చేస్తాయి.

25 వేల ఎకరాల ఆయకట్టు..

ఖిల్లా ఘణపూర్‌ బ్రాంచి కెనాల్‌ ద్వారా 25 వేల 285 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. వనపర్తి, దేవరకద్ర, నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గల్లోని గ్రామాలకు ఈ కెనాల్‌ ద్వారా సాగునీరు అందుతుంది. ప్రధానంగా ఖిల్లాఘణపూర్‌ మండలంలో 13,458 ఎకరాలు, అడ్డాకుల, భూత్పూర్‌ మండల గ్రామాలకు 9,978 ఎకరాలు, బిజినేపల్లి, తిమ్మాజిపేట్‌ మండలంలో 1849ఎకరాలకు ఖిల్లా ఘణపూర్‌ బ్రాంచి కెనాల్‌ సాగునీటిని అందిస్తున్నది. ఖిల్లాఘణపూర్‌ మండలంలో 16 చెరువులు, అడ్డాకుల మండలంలో 19చెరువులు, పెద్దమందడి మండలంలో 2చెరువులు నిండుతున్నాయి. గణపసముద్రంలో ఎన్నడూ లేని విధంగా నీరు వచ్చి చేరుతున్నది. ఖిల్లా ఘణపూర్‌ బ్రాంచి కెనాల్‌ ద్వారా సాగునీరు అందించడంతోపాటు మరో 33 గ్రామాలకు దాహార్తిని తీర్చుతున్నది. ఖిల్లాఘణపూర్‌ మండలంతో పాటు పెద్దమందడి మండలాల్లోని నీటి ఎద్దడి ఉన్న గ్రామాలకు ఈ కాలువ ద్వారా కృష్ణాజలాలను అందిస్తున్నారు. ఖిల్లాఘణపూర్‌లో గణప సముద్రాన్ని నింపి అక్కడి నుంచి కాలువల ద్వారా ఆయా ప్రాంతాలకు సాగునీటిని అందిస్తారు.

వనపర్తి, అక్టోబర్‌ 24(నమస్తే తెలంగాణ): ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం, ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ చేపట్టిన అభివృద్ధి పథకాలు ఇక్కడి ప్రజల బతుకులను మార్చివేశాయి. ఏటా ఇండ్లకు తాళాలు వేసి వలసవెళ్లే ఇక్కడి మనుషులు ఇప్పుడు పుట్టినగడ్డను వీడనంటున్నారు. ఉన్న ఊరిలో సకల సౌకర్యాలు ఉండగా పరాయి దేశం వలస వెళ్లబోమని స్పష్టం చేస్తున్నారు.l మ్రారుతున్న
బతుకులు

గామాలకే తిరిగి వలసలు

స్వీయపాలనలో అభివృద్ధి పరుగులు
సాగు,తాగునీటితో భరోసా
డబుల్‌ బెడ్రూం ఇండ్లతో ఆత్మగౌరవం
గిరిజనుల స్వయం పాలన

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో జరిగిన ఈప్రాంతంలో కనీవినీ ఎరుగని అభివృద్ధి జరిగింది. బీడు భూములు సస్యశ్యామలమయ్యాయి. నడవడానికి దారిలేని తండా లు, గ్రామాలు రోడ్లు వేయబడి కనెక్టివిటీ పెరిగింది. సాగునీరు లేని ప్రాంతాలు ఇప్పుడు రెండు పంటలకు సరిపడా నీరు సమృద్ధిగా లభిస్తున్నది, సీసీరోడ్లు, పల్లె ప్రకృతి వనాలు, సీసీరోడ్లు, మిషన్‌ భగీరథ పథకం, వైకుంఠధామాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి సీమాంధ్ర పాలకుల చేతుల్లో ఛిద్రమై పోయిన బతుకులకు కేసీఆర్‌ అమలు చేసిన పథకాలు జీవం పోశాయి. వనపర్తి జిల్లా ఖిల్లాఘణపూర్‌ మండలం ఒకప్పుడు నిర్లక్ష్యానికి వెనుకబాటుతనానికి కేరాఫ్‌ అడ్రస్‌ ఉండగా ప్రస్తుతం డెవలప్‌మెంట్‌కు రోల్‌మోడల్‌గా నిలిచింది.
వలసల నుంచి స్వగ్రామానికి ..
నీరు లేక కూటికి ఇబ్బంది పడ్డ ఇక్కడి రైతులు ముంబాయి, గుజరాత్‌,కర్ణాటక, తమిళనాడు, దుబాయి వంటి నగరాలకు బతుకు దెరువు కోసం వలస వెళ్లేవారు. పిల్లలను ముసలి తల్లిదండ్రుల వద్ద వదిలిపెట్టి భార్యభర్తలు బతుకుదెరువు వెతుక్కుంటూ ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు, గ్రామాల్లో , తండాల్లో ఖాళీ ఇండ్లు దర్శనమిచ్చేవి. 70 శాతం ఇండ్లకు తాళాలు పడేవి. ఎకరా భూమి రూ.15 నుంచి రూ.30 వేలు పలికేది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన పథకాలతో సాగు నీరు వచ్చి రెండు పంటలు పండుతూ ఒక్కో ఎకరం ఏరియాను అనుసరించి కోటి రూపాయల నుంచి రూ.15లక్షల వరకు పలుకుతున్నది. అసలు సాగుభూమి అమ్మే రైతులు కనబడటం లేదు. వలసలు తగ్గి ఇప్పుడు గ్రామాలు తండాలు కళకళలాడుతున్నాయి. తండాలను పంచాయతీలుగా మార్చడంతో గిరిజనుల్లో చాలా మంది సర్పంచులుగా, ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా ఎన్నికై ప్రజాప్రతినిధులయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో సాధ్యం కాని ఈ పరిస్థితి తెలంగాణలో సాధ్యమైంది.కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని గుడిపల్లి లిప్టు-3 ప్రధాన కాలువను అనుసరించి ఖిల్లాఘణపూర్‌ బ్రాంచి కెనాల్‌ను ప్రభుత్వం జీవో నెంబర్‌ 141 ద్వారా మంజూరు చేసింది. కేఎల్‌ఐ ప్రాజెక్టుకు 25 టీఎంసీలు మాత్రమే వరద జలాలు కేటాయించగా,ఈ జీవో ద్వారానే 40టీఎంసీలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. గతంలో సమైక్య పాలకులు 1984లో ఎంజీకేఎల్‌ఐ ప్రస్తావన తెచ్చినప్పటికీ 2004వరకు సర్వేల పేరుతో కాలయాపన చేశారు. 2004లో జలయజ్ఞం పేరుతో 25టీఎంసీల నీటిని కేటాయించి 2లక్షల 50వేల ఎకరాల ఆయకట్టుతో పనులను ప్రారంభించారు. ఆయకట్టును అంచెలంచెలుగా పెంచిన సమైక్యపాలకులు 3లక్షల40 వేల ఎకరాలకు తీసుకెళ్లారు. రెండున్నర లక్షల ఎకరాల లక్ష్యానికి తగ్గట్టుగా ఉన్న 25 టీఎంసీల నీటి కేటాయింపులను మాత్రం ఆయకట్టు భారీగా పెరిగినా ఎవరూ పట్టించుకోలేదు. ఈ లోపాన్ని గుర్తించిన మంత్రి నిరంజన్‌రెడ్డి కేఎల్‌ఐ నీటి కేటాయింపులను పెంచడంలో తనదైన శైలిలో కృషి చేశారు. అదనపు ప్రాంతానికి సాగునీటి వవనరులను పెంచుతున్న క్రమంలో 40టీఎంసీలను కేటాయించింది. అలాగే ఖిల్లాఘణపూర్‌ బ్రాంచి కెనాల్‌కు రూ.105 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసి 2016 సెప్టెంబర్‌లో టెండరు ప్రక్రియను కూడా పూర్తి చేసి పనులకు శ్రీకారం చుట్టడంతో ఇప్పుడు ఎటు చూసినా పచ్చని పొలాల అందాలు కనువిందు చేస్తాయి.
25 వేల ఎకరాల ఆయకట్టు..
ఖిల్లా ఘణపూర్‌ బ్రాంచి కెనాల్‌ ద్వారా 25 వేల 285 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. వనపర్తి, దేవరకద్ర, నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గల్లోని గ్రామాలకు ఈ కెనాల్‌ ద్వారా సాగునీరు అందుతుంది. ప్రధానంగా ఖిల్లాఘణపూర్‌ మండలంలో 13,458 ఎకరాలు, అడ్డాకుల, భూత్పూర్‌ మండల గ్రామాలకు 9,978 ఎకరాలు, బిజినేపల్లి, తిమ్మాజిపేట్‌ మండలంలో 1849ఎకరాలకు ఖిల్లా ఘణపూర్‌ బ్రాంచి కెనాల్‌ సాగునీటిని అందిస్తున్నది. ఖిల్లాఘణపూర్‌ మండలంలో 16 చెరువులు, అడ్డాకుల మండలంలో 19చెరువులు, పెద్దమందడి మండలంలో 2చెరువులు నిండుతున్నాయి. గణపసముద్రంలో ఎన్నడూ లేని విధంగా నీరు వచ్చి చేరుతున్నది. ఖిల్లా ఘణపూర్‌ బ్రాంచి కెనాల్‌ ద్వారా సాగునీరు అందించడంతోపాటు మరో 33 గ్రామాలకు దాహార్తిని తీర్చుతున్నది. ఖిల్లాఘణపూర్‌ మండలంతో పాటు పెద్దమందడి మండలాల్లోని నీటి ఎద్దడి ఉన్న గ్రామాలకు ఈ కాలువ ద్వారా కృష్ణాజలాలను అందిస్తున్నారు. ఖిల్లాఘణపూర్‌లో గణప సముద్రాన్ని నింపి అక్కడి నుంచి కాలువల ద్వారా ఆయా ప్రాంతాలకు సాగునీటిని అందిస్తారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement