వనపర్తి రూరల్, నవంబర్ 2 : మండలంలో ని వెంకటాపురం గ్రామానికి చెందిన స్వాతం త్య్ర సమరయోధుడు కొండ నారాయణరెడ్డి స్ఫూర్తి ప్రదాత అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని అంకూర్ గ్రామ శివారులో ఏర్పాటు చేసి నారాయణరెడ్డి విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆ యన పోరాట పటిమలు ఎంతో గొప్పవని అ న్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్రె డ్డి, సర్పంచ్ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంపీటీసీ రంగారె డ్డి, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, నారాయణరెడ్డి భార్య రోహిణీదేవి, కుటుంబ సభ్యులు కొండ శ్రీకాంత్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, రవిప్రకాశ్‌రెడ్డి, జగన్మోహన్రెడ్డి, నర్సింహారెడ్డి, మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.