చౌటుప్పల్, మార్చి 28 : తెలంగాణలో పండిన వడ్లను కేంద్ర ప్రభుత్వం బేషరతుగా కొనుగోలు చేయాలని మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్ చేశారు. పట్టణంలోని మార్కెట్ యార్డులో సోమవారం నిర్వహించిన మార్కెట్ కమిటీ పాలకవర్గ సమావేశంలో వడ్లను కొనుగోలు చేయాలని తీర్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. ఇందుకు భిన్నంగా కేంద్రం రైతులపై తీవ్ర వివక్ష చూపుతున్నదని విమర్శించారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కప్పల శ్రీనివాస్‌గౌడ్, టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు ముత్యాల ప్రభాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గుండబోయిన వెంకటేశ్‌యాదవ్, డైరెక్టర్లు పగిళ్ల సుధాకర్‌రెడ్డి, ఎండీ.చాంద్‌పాషా, మంచికంటి భాస్కర్, కిరణ్‌గౌడ్ పాల్గొన్నారు.
వలిగొండ, మార్చి 28 : పంజాబ్ తరహాలో తెలంగాణలో కూడా కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని పీఏసీఎస్ చైర్మన్ సుర్కంటి వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం వలిగొండ పీఏసీఎస్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ధాన్యం కొనుగోలు చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఎల్లంకి స్వామి, సభ్యులు కుంభం విద్యాసాగర్‌రెడ్డి, సత్యనారాయణ, పాశం వెంకట్‌రెడ్డి, కొమిరెల్లి సంజీవరెడ్డి, జక్క శంకర్‌రెడ్డి, పైళ్ల వీరారెడ్డి, సీఈఓ అమరేందర్, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.