పెంచికల్పేట్ : ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ తాసీల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న వీఆర్వో జిల్లపెల్లి వెంకటేశ్వర్లు శుక్రవారం తెల్లవారుజామున కాగజ్‌నగర్ పట్టణంలో గుండెపోటుతో మృతిచెందారు. నార్నూర్ మండల కేంద్రానికి చెందిన ఆయన గత మూడు సంవత్సరాలుగా కాగజ్‌నగర్ పట్టణం నుంచి పెంచికల్‌పేట కార్యాలయంలో వీఆర్ఓగా విధులు నిర్వహిస్తున్నారు.
తెల్లవారుజామున వాకింగ్‌కు వెళ్లిన సమయంలో ఒకేసారి గుండెపోటు వచ్చి సొమ్మసిల్లి కింద పడడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. ఆయన మృతిపట్ల మండల కేంద్రంలోని తాసీల్ కార్యాలయంలో తహసీల్దార్ అనంతరాజు రెండు నిమిషాల మౌనం పాటించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.