హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఓటరు జాబితా ల ప్రత్యేక సవరణ (సర్), ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. సీఈవో కార్యాలయం గురువారం సాయంత్రం 6 గంటల వరకు వెల్లడించిన అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఎన్యుమరేష న్ ఫారామ్ (ఈఎఫ్)లను 100% పంపి ణీ చేసినప్పటికీ, వాటిని సేకరించి ఆన్లైన్లో డిజిటలైజ్ చేసే ప్రక్రియ వేగంగా సాగడం లేదు. రాష్ట్రంలోని మొత్తం 3,38,26,448 మంది ఓటర్లలో ఇప్పటివరకు 2,41,32,992 (71.34%) మంది ఫారాలు మాత్రమే డిజిటలైజ్ అయ్యాయి.
ఇంకా 28.66% మంది ఓ టర్ల వివరాలు డిజిటలైజ్ కావాల్సి ఉన్న ది. ఈఎఫ్ల సమర్పణకు ఆగస్టు 3 చివ రి తేదీ కావడంతో మిగిలిన 10 రోజుల స్వల్ప వ్యవధిలో ఈ భారీ ప్రక్రియను పూర్తిచేయడం బీఎల్వోలకు, అధికార యంత్రాంగానికి పెను సవాలుగా మా రింది. ప్రస్తుతం ఈఎఫ్ల డిజిటలైజేషన్లో యాదాద్రి భువనగిరి జిల్లా ప్రథమ స్థానంలో నిలువగా.. హైదరాబాద్ జిల్లా చిట్టచివరి స్థానంలో ఉన్నది.