బేగంపేట్ ఏప్రిల్ 28: ఓటరు జాబితా సవరణ కోసం మే 1 నుంచి నిర్వహించే ఇంటింటి సర్వే కార్యక్రమం పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ పిలుపునిచ్చారు. మంగళవారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని క్యాంపు కార్యాలయంలో సనత్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో తలసాని సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ సర్వేపై ఇప్పటికే దేశ వ్యాప్తంగా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని దీనిని దృష్టిలో పెట్టుకోని సర్వే సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
ఇంటింటికి సర్వేకు వచ్చే అధికారులతో సమన్వయం చేసుకునేందుకు గాను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బూత్‌కు ఒక్కరు చొప్పున ఏజెంట్లుగా నియమిస్తున్నట్టు వివరించారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ మల్లికార్జున్‌గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుర్రం పవన్‌కుమార్‌గౌడ్, ఆకుల హరికృష్ణ, కొలన్ బాల్‌రెడ్డి, శ్రీహరి,అత్తెల్లి శ్రీనివాస్‌గౌడ్, వెంకటేషన్ రాజు,మహేశ్ యాదవ్,శేఖర్ ముదిరాజ్, ఆంజనేయులు, ప్రవీణ్‌రెడ్డి, ప్రేమ్, కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.