Valcono Erruption : ఇండోనేషియా (Indonasia) లోని సుప్రసిద్ధ అనక్ క్రాకటోవా (Anak Krakatau) అగ్నిపర్వతం ఇటీవల బద్దలైంది. సుమారు 25 గంటలపాటు నిరంతరాయంగా లావా, బూడిద వెదజల్లడంతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ విస్ఫోటనం కారణంగా ఆకాశమంతా దట్టమైన బూడిద మేఘాలు అలుముకోవడంతో రవాణా వ్యవస్థ, ముఖ్యంగా విమాన సర్వీసులు పూర్తిగా స్తంభించిపోయాయి. ఈ అగ్నిపర్వతం 24 గంటలపాటు ఏకధాటిగా లావాను వెలిగక్కింది. ఈ విస్ఫోటానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అవుతున్నాయి.
ఆకాశంలో దట్టమైన బూడిద వ్యాపించడంతో ముందుజాగ్రత్త చర్యగా జకార్తాలోని సోకర్నో-హట్టా, హలిమ్ పెర్దనకుసుమ అంతర్జాతీయ విమానాశ్రయాలతో సహా మొత్తం 8 ఎయిర్పోర్టులను తాత్కాలికంగా మూసివేశారు. ఈ నిర్ణయంతో సుమారు 2,300 విమాన సర్వీసులు రద్దు లేదా దారి మళ్లించారు. దీనివల్ల దాదాపు 2.70 లక్షల మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు. ఇండోనేషియా జియోలాజికల్ ఏజెన్సీ లెవెల్-3 (హై అలర్ట్) హెచ్చరికను జారీచేసింది. స్థానికంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
రాబోయే రోజుల్లో మరిన్ని విస్ఫోటనాలు సంభవించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ విస్ఫోటనం వల్ల సునామీ ప్రమాదం ఏమీ లేదని అధికారులు స్పష్టం చేయడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. 2018లో ఇదే అగ్నిపర్వతం బద్దలైనప్పుడు సంభవించిన సునామీ కారణంగా సుమారు 430 మంది మరణించారు. ప్రస్తుతానికి బూడిద, విష వాయువులు, వేడి రాళ్ల ముప్పు మాత్రమే ఉందని తెలిపారు. పరిస్థితి వేగంగా మారుతున్నందున విమానాశ్రయాల పునఃప్రారంభంపై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేమని రవాణాశాఖ మంత్రి దుదీ పుర్వగంధీ పేర్కొన్నారు.
🌋✈️🌏 Imagenes impresionantes del volcán Anak Krakatoa, situado en el estrecho de Sonda en Indonesia, completó 25 horas de erupción continua con columnas de ceniza de hasta 15.000 metros de altura. Se han cancelado 2.300 vuelos en 7 aeropuertos con 270.000 pasajeros afectados. pic.twitter.com/JAW2uZTFrc
— Cesar Augusto Londoño (@cesaralo) September 8, 2026