vivo Y19s 5G | ప్రస్తుతం చాలా వరకు స్మార్ట్ ఫోన్ కంపెనీలు తక్కువ ధరలోనే వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్‌తోపాటు భారీ బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ క్వాలిటీ కలిగిన ఫోన్లను రూపొందించి వినియోగదారులకు అందిస్తున్నాయి. అందులో భాగంగానే వినియోగదారులు కూడా అలాంటి ఫోన్లను కొనుగోలు చేసేందుకే ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక ఇదే కోవలో వివో కూడా మరో నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. వై19ఎస్ 5జి పేరిట ఈ ఫోన్‌ను విడుదల చేశారు. వై సిరీస్‌లో వివో విడుదల చేసిన లేటెస్ట్ ఫోన్ ఇదే కావడం విశేషం. ఈ ఏడాది వై19ఇ 4జి పేరిట ఓ ఫోన్‌ను లాంచ్ చేయగా, ఇప్పుడు వై19ఎస్ 5జి ఫోన్‌ను రిలీజ్ చేశారు. ఈ ఫోన్లో పలు అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నారు. ధర కూడా చాలా తక్కువగానే ఉండడం విశేషం.
వివో వై19ఎస్ 5జి ఫోన్లో 6.74 ఇంచుల డిస్ప్లేను ఏర్పాటు చేశారు. ఇది హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను, 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. కనుక డిస్ప్లే క్వాలిటీగా ఉంటుందని చెప్పవచ్చు. అద్భుతమైన దృశ్యాలను డిస్ప్లేపై వీక్షించవచ్చు. ఈ ఫోన్లో ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 6జీబీ వరకు ర్యామ్ లభిస్తుంది. ర్యామ్‌ను అదనంగా మరో 6జీబీ వరకు వర్చువల్‌గా పెంచుకునే వీలు కల్పించారు. అందువల్ల ఫోన్ వేగవంతమైన ప్రదర్శనను ఇస్తుంది. ఇక ఈ ఫోన్లో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. వెనుక వైపు 13 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. ముందు వైపు 5 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఈ ఫోన్లో 6000ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి 15 వాట్ల ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ లభిస్తుంది. అందువల్ల బ్యాటరీ వేగంగా చార్జింగ్ కూడా అవుతుంది.
ఈ ఫోన్‌ను 4జీబీ, 6జీబీ ర్యామ్, 64జీబీ, 128జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. మెమొరీని కార్డు ద్వారా 2టీబీ వరకు పెంచుకోవచ్చు. డ్యుయల్ సిమ్ వేసుకోవచ్చు. రెండు సిమ్ కార్డులు, ఒక మైక్రో ఎస్డీ కార్డుకు మొత్తం కలిపి 3 వేర్వేరు స్లాట్లను ఇచ్చారు. అందువల్ల ఇది హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ స్లాట్ కాదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ పక్క భాగంలో ఉంటుంది. ఈ ఫోన్‌కు గాను మిలిటరీ గ్రేడ్ నాణ్యతను అందిస్తున్నారు. చాలా తక్కువ ధరలోనే ఈ ఫీచర్ లభిస్తున్న ఫోన్లలో ఇదొకటి కావడం విశేషం. అలాగే ఈ ఫోన్‌కు గాను ఐపీ64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా ఉండడం విశేషం. ఇందులో 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ ఫీచర్ కూడా లభిస్తుంది. డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.2, యూఎస్బీ టైప్ సి వంటి అదనపు సదుపాయాలను సైతం ఇందులో అందిస్తున్నారు.
వివో వై19ఎస్ 5జి ఫోన్‌ను మేజస్టిక్ గ్రీన్, టైటానియం సిల్వర్ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.10,999 ఉండగా, 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.11,999గా ఉంది. అలాగే టాప్ ఎండ్ మోడల్ 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధరను రూ.13,499గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ను అన్ని ఆఫ్‌లైన్ స్టోర్స్‌తోపాటు పలు ఎంపిక చేసిన ఆన్లైన్ స్టోర్స్‌లోనూ విక్రయిస్తున్నారు.