ISRO | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ప్రయోగించిన సీఎంఎస్03 ప్రయోగం విజయవంతమైంది. బాహుబలి రాకెట్ ఎల్వీఎం3-ఎం5 రాకెట్ కమ్యూనికేషన్ శాటిలైట్‌ను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. సీఎంఎస్-03 సమాచార ఉపగ్రహం బరువు 4410 కిలోలు. ఇప్పటి వరకు భారత్ ప్రవేశపెట్టిన ఉపగ్రహాల్లో అన్నింటికంటే ఇదే అతిపెద్దది కావడం విశేషం. ఏపీలోని శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఆదివారం సాయంత్రం 5.26 గంటలకు రాకెట్‌ను ఇస్రో నింగిలోకి పంపింది. దాదాపు అరగంటకుపైగా ప్రయోగించిన రాకెట్ విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టినట్లుగా ఇస్రో ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రయోగం విజయవంతం అవడంపై ఇస్రో చైర్మన్ వీ నారాయణన్ శాస్త్రవేత్తలను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రయోగం విజయవంతం కావడం ఆనందంగా ఉందన్నారు. విజయంలో కీలకపాత్ర పోషించిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు. ఈ ప్రయోగంతో భారత్ మరో ఘనత సాధించిందని తెలిపారు.
శాస్త్రవేత్తలు, సిబ్బంది కృషితోనే ఇదంతా సాధ్యమైందని పేర్కొన్నారు. చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధ్రువంలో దిగడంతో ఎల్వీఎం3 భారత్‌కు కీర్తిని తెచ్చిపెట్టిందని.. నేడు అత్యంత బరువైన ఉపగ్రహాన్ని విజయవంతంగా మళ్లీ విజయాన్ని సాధించిందన్నారు. ఈ మిషన్ కోసం రాకెట్ పనితీరుతో పాటు పేలోడ్ సామర్థ్యాన్ని పెంచాల్సి వచ్చిందన్నారు. ఈ శాటిలైట్ మల్టీబ్యాండ్ కమ్యూనికేషన్ ఉపగ్రహమని.. దాదాపు 15 సంవత్సరాలు సేవలు అందించేలా రూపొందించామన్నారు. ఈ ఉపగ్రహం సరికొత్త సాంకేతిక టెక్నాలజీతో రూపొందించామన్నారు. ఆత్మనిర్భర్ భారత్‌కు అద్భుతమైన ఉదాహారణ అని.. ఆత్మనిర్భర్ దిశగా ఇస్రో అడుగులు వేస్తోందని చెప్పారు. అన్నారు. కీలకమైన, సంక్లిష్టమైన ఉపగ్రహాన్ని తయారు చేసిన శాస్త్రవేత్తలు, సిబ్బంది బృందాన్ని తెలుపుతున్నానన్నారు. ప్రయోగ సమయంలో కఠినమైన, సవాల్‌తో కూడుకున్నదని.. వాతావరణం అంతగా సహకరించలేదన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరినీ అభినందించేందుకు ఉన్న ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నానన్నారు.