కంకరలో చిక్కుకున్న ఈ మహిళను చూశారా? ఆమె వేదన ఎవరికి తెలుసు? ఆ నరకయాతనకు ఇంకేం సాక్ష్యం కావాలి? టిప్పర్ ఓవర్ లోడ్‌తో ఉందా? బస్సు ఓవర్క్రౌడ్గా ఉందా? ఇది మనం ఆలోచించాలి. మనం ఏది చేసినా మన ప్రాణాలను కాపాడుకోవడమే మన లక్ష్యంగా ఉండాలి. క్షేమంగా ఉండాలంటే.. హద్దులు మీరితే కుదరదు. ప్రయాణాలు ముఖ్యమే కానీ వాటితో ప్రమాదాలు తెచ్చుకోవద్దు. కంకరతో నిండిన లారీ.. కిక్కిరిసిన బస్సు.. ఎవర్ని తప్పుపట్టినా .. ప్రాణం తిరిగిరానిది. సౌకర్యవంతంగా లేని రోడ్లపై ఫీట్లు చేస్తే అది మనుషులకే ముప్పు. రోడ్డు రూల్స్ పాటిస్తే .. ఏ సమస్యా ఉండదు. కానీ హైవే నాలెడ్జ్ లేకుంటే ఎవరూ ఏమీ చేయలేరు. మన స్వీయ నియంత్రణే మనకు రక్ష. ఇక్కడ ఇంకో విషయం కూడా ఆలోచించాలి. రద్దీకి తగ్గ బస్సులను నడపక పోవడం, రోడ్లు అద్వాన్నంగా ఉండటం కూడా ప్రమాదాలకు కారణం కావచ్చు. 50 మంది ఎక్కాల్సిన బస్సులో 70 మంది ఎందుకు ఎక్కుతారు… జనం రద్దీకి తగ్గ బస్సులు నడపకపోతే ఇలాగే ఉంటది. టిప్పర్ కూడా ఓవర్‌లోడ్‌తోనే ఉంది. అసలు ఆ టైంలో టిప్పర్‌కు ఆ రోడ్డుపైన అనుమతి ఉందా అనేది తెలియాల్సి ఉంది. ఇంత పెద్ద ప్రమాదానికి ఇవన్నీ కారణాలే అనేది అందరూ ఆలోచించాల్సిన విషయం.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల(Chevella Accident )లో జరిగిన ఈ ఘటన అత్యంత హృదయవిదారకరమైంది. కంకర మీద పడి ప్రాణాల కోసం ఆర్తనాదాలు చేస్తున్న ఆ మహిళను స్థానికులు రక్షించారు. ఓవర్‌లోడ్ ఉన్నా.. ఓవర్ క్రౌడ్ ఉన్నా.. ఆ వాహనానికి అంత ఈజీగా బ్రేక్‌లు పడవు. ఓవర్‌లోడ్.. ఓవర్క్రౌడ్తో.. వాహనాన్ని మనకు నచ్చినట్లు నడపలేం. మనం ఎంత చురుకుగా ఆలోచించినా.. అది వెహికిల్ డైనమిక్స్‌కు ఎప్పటికీ సెట్‌కాదు. కంకరలో కూరుకుపోయిన వారిలో కొందరు చనిపోయారు. దీంతో రంగారెడ్డి జిల్లా రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య 21కి చేరుకున్నది.
🚨 Breaking News 🚨
A horrific road accident in #Rangareddy district An #RTC bus from #Tandur depot collided with a #TipperLorry carrying gravel near #Mirzaguda on the #Hyderabad #Bijapur highway
Driver died on the spot;several passengers injured, some under gravel.#Chevella pic.twitter.com/0mJMLEYIzk
— Rajesh Kumar Reddy E V (@rajeshreddyega) November 3, 2025