Sree Vishnu | శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న పూర్తి వినోదాత్మక చిత్రం ‘#సింగిల్’. కార్తీక్ రాజు దర్శకత్వంలో విద్య కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పకులు. ఈ చిత్రం టైటిల్ పోస్టర్, గ్లింప్స్‌ని మేకర్స్ సోమవారం విడుదల చేశారు. ఈ పోస్టర్లో ఒక చేతిలో మ్యూజిక్ సిస్టం, మరొక చేతిలో దీపావళి క్రాకర్ పట్టుకొని శ్రీవిష్ణు రెబల్‌గా కనిపిస్తున్నారు.
35ఏండ్ల వయసులో కూడా తానెందుకు ఒంటరిగా ఉన్నాడో వివరిస్తూ వెన్నెల కిశోర్ వాయిస్‌తో ఈ గ్లింప్స్ సాగింది. వాలెంటైన్స్ డే రోజున ఒక పార్క్‌లోకి మ్యూజిక్ సిస్టమ్‌తో రావడం, క్రాకర్స్ కాల్చడం, పార్క్‌లో ఉన్న ప్రేమజంటలన్నీ అప్సెట్ అవ్వడం.. ఈ సన్నివేశాలన్నీ అలరిస్తాయి. శ్రీవిష్ణు ైస్టెలిష్ మేకోవర్, హీరోయిన్లు కేతికా శర్మ, ఇవానా అందచందాలు ఈ గ్లింప్స్‌లో హైలైట్స్. ఈ చిత్రానికి మాటలు: భాను భోగవరపు, నందు సవిరిగాన, కెమెరా: ఆర్.వెల్రాజ్, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, నిర్మాణం: గీతాఆర్ట్స్, కళ్యా ఫిల్మ్స్.