ఖలీల్‌వాడి, ఏప్రిల్ 25 : నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ సైకియాట్రిక్ డాక్టర్ విశాల్‌ను ఇండియన్ సైకియాట్రిక్ సోషల్ మీడియా ప్రత్యేక కమిటీ జాతీయ కన్వీనర్‌గా నియమితులయ్యారు. సోమవారం కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్‌లో నిర్వహించిన జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు విశాల్‌కు నియామక పత్రాన్ని అధ్యక్షుడు డాక్టర్ ఎన్ఎన్ రాజు అందజేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ.. తమ సొసైటీ 1947లో 15 మంది సభ్యులతో మొదలై ప్రస్తుతం ఏడువేల మందికి పైగా మానసిక వైద్య నిపుణులు సభ్యులుగా ఉన్నారని తెలిపారు.