
హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): డొమెస్టిక్ పీస్ చిత్రానికి ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డు, జేసీఎస్ ఇంటర్నేషనల్ యంగ్ క్రియేటివ్స్ అవార్డు గెలుచుకున్న శరత్చంద్రకు వీసా సమస్యలు వచ్చాయి. ‘అతను యూఎస్ వెళ్లడానికి అత్యవసరంగా వీసా కావాలి. దయచేసి సాయం చేయండి కేటీఆర్ సార్’ అంటూ శశిధర్ అనే జర్నలిస్ట్ సోమవారం ట్వీట్ చేశారు. మంత్రి కేటీఆర్ దీనిపై వెంటనే స్పందించారు. ‘అంతర్జాతీయ ఎమ్మీ అవార్డు విజేత వీసా అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోండి’ అంటూ హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సల్ జనరల్ జోయెల్ రీఫ్‌మన్‌కు ట్విట్టర్లో విజ్ఞప్తి చేశారు. సమస్య తన దృష్టికి తెచ్చినందుకు శరత్‌కు ధన్యవాదాలు తెలిపారు.