Samantha | అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన ‘లెనిన్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడంతో సినీ పరిశ్రమ నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా స్టార్ హీరోయిన్ సమంత చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా మారింది. సినిమా విడుదల రోజునే ‘లెనిన్’ ట్రైలర్‌ను షేర్ చేస్తూ చిత్ర బృందానికి ఆమె బెస్ట్ విషెస్ తెలియజేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమంత తన పోస్ట్‌లో.. ఇప్పటికే బ్లాక్‌బస్టర్ వైబ్స్ కనిపిస్తున్నాయి. మొత్తం టీమ్‌కు ఆల్ ది బెస్ట్ అంటూ శుభాకాంక్షలు తెలిపింది. ముఖ్యంగా అఖిల్‌కు కూడా విజయాన్ని ఆకాంక్షిస్తూ ఆమె చేసిన ఈ పోస్ట్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. వ్యక్తిగత జీవితంలో మార్పులు వచ్చినప్పటికీ, వృత్తిపరంగా పరస్పరం ప్రోత్సహించుకోవడం మంచి పరిణామమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఇటీవల సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా గురించి ‘లెనిన్’ ప్రమోషన్స్‌లో అఖిల్ కూడా సానుకూలంగా స్పందించారు. షూటింగ్ పనుల్లో బిజీగా ఉండటంతో ఇంకా సినిమా చూడలేదని చెబుతూ, లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో యాక్షన్‌కు ప్రాధాన్యం ఇవ్వడం తనకు నచ్చిందని, సమంతకు మంచి విజయం దక్కడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు అఖిల్ సినిమాకు సమంత కూడా అదే తరహాలో శుభాకాంక్షలు తెలియజేయడంతో ఇద్దరి మధ్య ఉన్న పరస్పర గౌరవం మరోసారి హైలైట్ అయింది. గతంలో అక్కినేని కుటుంబంతో సమంతకు ఉన్న అనుబంధం గురించి తరచూ చర్చ జరుగుతుంటే, ఈ పోస్ట్‌తో ఆ చర్చకు మరింత ఊతం లభించింది.
సమంత, నాగచైతన్య వ్యక్తిగత జీవితంలో వేర్వేరు మార్గాలు ఎంచుకున్నప్పటికీ, సినీ పరిశ్రమలో మాత్రం వృత్తిపరమైన మర్యాదను కొనసాగిస్తున్నారని అభిమానులు పేర్కొంటున్నారు. వ్యక్తిగత అంశాలను పక్కనబెట్టి మంచి సినిమాలను, సహచర నటీనటులను ప్రోత్సహించడం ప్రశంసనీయమని సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే, ‘లెనిన్’ చిత్రానికి తొలి షోల నుంచే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. అఖిల్ నటన, ఎమోషనల్ కథనం, యాక్షన్ ఎపిసోడ్స్‌కు మంచి స్పందన లభిస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సమంత చేసిన శుభాకాంక్షల పోస్ట్ కూడా సినిమాకు అదనపు ప్రచారంగా మారింది.