దుబాయ్: టీమ్ఇండియా రన్ మిషీన్ విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానం దక్కించుకున్నాడు. నిరుడు రెండు ఫార్మాట్ల నుంచి తప్పుకుని వన్డేలు మాత్రమే ఆడుతున్న కోహ్లీ.. ఆస్ట్రేలియాతో పాటు స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ అద్భుతంగా రాణించాడు.
తాజాగా న్యూజిలాండ్‌తో వడోదరలో జరిగిన తొలి వన్డేలో 93 రన్స్ చేయడంతో అతడు.. మొదటి స్థానంలో ఉన్న రోహిత్ శర్మను అధిగమించి తన కెరీర్లో 11వ సారి ఈ ఘనతను అందుకున్నాడు. చివరిసారిగా వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లీ 2021లో అగ్రస్థానం సాధించాడు. రోహిత్ తొలిస్థానాన్ని కోల్పోయి మూడో స్థానానికి దిగజారాడు.