ఢిల్లీ : న్యూజిలాండ్‌లోని అక్లాండ్ వేదికగా జరుగుతున్న డబ్ల్యూటీఏ ఏఎస్‌బీ క్లాసిక్ 250 టెన్నిస్ టోర్నీలో భారత టెన్నిస్ ఆటగాడు యూకీ బాంబ్రీ సెమీస్ చేరాడు. ఆండ్రె గోరన్సన్ (స్వీడన్)తో జతకట్టిన బాంబ్రీ.. పురుషుల డబుల్స్‌లో 6-3, 6-7 (3/7), 10-6తో పాట్రిక్ రికి, పెట్ నౌజ (చెక్) జోడీపై గెలిచి సెమీస్ స్థానాన్ని ఖాయం చేసుకున్నారు.