Virat Kohli | విరాట్ కోహ్లీ ఫిట్నెస్కి అధిక ప్రాధాన్యం ఇస్తాడన్న విషయం అందరికీ తెలిసిందే. నిరంతరం కష్టపడుతూ తన శరీరాన్ని దృఢంగా ఉంచుకుంటాడు. ఫిట్‌నెస్‌లో భారత క్రికెట్ జట్టు (Indian Cricket Team) సభ్యులందరూ విరాట్‌ను స్ఫూర్తి (Inspiration) గా తీసుకుంటారు. వ్యాయామం, డైట్‌కు అంతలా ప్రాధాన్యమిస్తాడు ఈ స్టార్ బ్యాట్స్‌మెన్. తాజాగా కోహ్లీ జిమ్‌లో రన్ చేస్తు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు.
77వ స్వాంతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు హాలిడే అన్న విషయం తెలిసిందే. అయితే “హాలిడే అయినా కూడా ఎక్సర్సైజ్ చేయల్సిందే” అంటూ కోహ్లీ ఓ వీడియో విడుదల చేశాడు. ఇక ఈ వీడియోలో కోహ్లీ జిమ్‌లో ట్రెడ్‌మిల్‌పై రన్ చేస్తున్నట్లు ఉండగా.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్లు విరాట్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫిట్‌నెస్‌పై అతనికున్న శ్రద్ధకు ఫిదా అవుతున్నారు.
Chutti hai fir bhi bhaagna toh padega 😁🏃 pic.twitter.com/BwNVLDs2O9
— Virat Kohli (@imVkohli) August 15, 2023
విరాట్ ప్రస్తుతం ఈ నెలాఖరున మొదలవ్వనున్న ఆసియా కప్ (Asia Cup 2023) కోసం సన్నద్ధమవుతున్నాడు. నిరుడు ఇదే టోర్నీలో ఫామ్‌లోకి వచ్చిన ఈ స్టార్ ప్లేయర్ మళ్లీ పరుగుల వరద పారించాలనే ఉద్దేశంతో ఉన్నాడు. ఈ మెగా టోర్నీలో 102 రన్స్ చేస్తే కోహ్లీ వన్డేల్లో 13 వేల క్లబ్లో చేరతాడు.