Virat Kohli | టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్, పరుగుల రారాజు విరాట్ కోహ్లీ (Virat Kohli) పుట్టిన రోజు నేడు. అండర్ -19 వరల్డ్ కప్ హీరోగా జట్టులోకి వచ్చి.. విలువైన ఆటగాడిగా.. సమర్ధుడైన నాయకుడిగా జట్టుపై తన ముద్ర వేసిన కోహ్లీ నేడు 37వ వసంతంలో అడుగుపెట్టాడు (Virat Kohli birthday). ఈ సందర్భంగా కోహ్లీకి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సహచర ఆటగాళ్లు, సీనియర్ క్రికెటర్లు, అభిమానులు ఈ క్రికెట్ కింగ్‌కు విషెస్ తెలుపుతున్నారు. ఈ సందర్భంగా కోహ్లీ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం..
కోహ్లీ ఫిట్నెస్కి అధిక ప్రాధాన్యం ఇస్తాడన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రపంచంలోని ఫిట్టెస్ట్ క్రికెటర్(Fittest Cricketer) ఎవరు? అని అడిగితే.. కోహ్లీ అని ఎవరైనా ఠక్కున చెప్పేస్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. నిరంతరం కష్టపడుతూ తన శరీరాన్ని దృఢంగా ఉంచుకుంటాడు. ఆటతో పాటు ఫిట్నెస్తో విరాట్ కోట్లాది మంది అభిమానుల మనసు గెలిచాడు. ఫిట్‌నెస్‌లో భారత క్రికెట్ జట్టు సభ్యులందరూ విరాట్‌ను స్ఫూర్తిగా తీసుకుంటారు. వ్యాయామం, డైట్‌కు అంతలా ప్రాధాన్యమిస్తాడు ఈ స్టార్ బ్యాట్స్‌మెన్.
ఫిట్‌గా ఉండేందుకు కోహ్లీ మూడింటికే అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఫిట్నెస్, ఆహారం విషయంలో క్రమశిక్షణతో ఉంటారు. రోజూ ఉదయం లేవగానే కార్డియో వర్కవుట్స్, క్రికెట్ ప్రాక్టీస్ చేస్తారు. ఇక ఆహారం విషయానికి వస్తే.. జంక్ ఫుడ్ అస్సలు తినరు. కూల్ డ్రింక్స్ వంటి వాటికి దూరంగా ఉంటారు. ఇక కోహ్లీ నిద్రకు కూడా తగిన ప్రాధాన్యత ఇస్తారు. నిద్ర విషయంలో అస్సలు రాజీపడరు. దాదాపు ఎనిమిది గంటలపాటు ప్రశాంతంగా నిద్రపోతారు. మంచి నిద్రతో తగిన విశ్రాంతి దొరుకుతుందని కోహ్లీ భావిస్తారు. కోహ్లీ ఫిట్నెస్ వెనుక ఉన్న ఈ రహస్యాన్ని (Kohli Fitness Secret) ఆయన సతీమణి, స్టార్ నటి అనుష్క శర్మ (Anushka Sharma) ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.
Also Read..
Hardik Pandya | బీచ్‌లో చిల్ అవుతూ.. హార్దిక్ పాండ్యా-మహియెకా శర్మ రొమాంటిక్ ఫొటో వైరల్
Amanjot Kaur | ‘మా నానమ్మ బతికే ఉంది’.. దయచేసి తప్పుడు వార్తలు ప్రచారం చేయకండి..!
ఇది సార్ అమ్మాయిల బ్రాండ్.. మహిళా క్రికెటర్ల కోసం క్యూ కడుతున్న కంపెనీలు