Hardik Pandya | బీచ్‌లో చిల్ అవుతూ.. హార్దిక్ పాండ్యా-మహియెకా శర్మ రొమాంటిక్ ఫొటో వైరల్
Hardik Pandya | స్టార్ క్రికెటర్, టీమ్ ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఇటీవలే తరచూ వార్తల్లో నిలుస్తోన్న విషయం తెలిసిందే.
Hardik Pandya | స్టార్ క్రికెటర్, టీమ్ ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఇటీవలే తరచూ వార్తల్లో నిలుస్తోన్న విషయం తెలిసిందే. భార్య నటాషాతో విడాకుల అనంతరం హార్దిక్ మళ్లీ డేటింగ్లో ఉన్నారంటూ కొంతకాలంగా తెగ ప్రచారం జరుగుతోంది (Dating Rumours). మోడల్, నటి మహియెకా శర్మ (Mahieka Sharma)తో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే వీరిద్దరూ జంటగా ముంబై ఎయిర్పోర్ట్ (Mumbai airport)లో కెమెరాకు చిక్కారు.
ఇప్పుడు తాజాగా మరోసారి ఈ జంట హెడ్‌లైన్స్‌లో నిలిచింది. హార్దిక్ పాండ్యా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలను షేర్ చేశారు. అందులో మహియెకాతో కలిసి పాండ్యా బీచ్‌లో చిల్ అవుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ రొమాంటిక్ ఫొటోలతో వీరిద్దరి బంధంపై నెట్టింట మరోసారి చర్చ మొదలైంది. వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ వస్తున్న వార్తలు నిజమే అంటూ నెటిజన్లు చెప్పుకుంటున్నారు.
నటాషాతో విడాకులు ప్రకటించిన అనంతరం పాండ్య బ్రిటీష్ సింగర్ జాస్మిన్ వాలియాతో కొన్నిరోజులు డేటింగ్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇది కూడా కొన్నిరోజులకే బ్రేకప్ అవ్వగా.. తాజాగా మహియెకా శర్మతో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వైరలవుతున్నాయి. మొదటగా ఈ పుకార్లు రెడిట్ అనే సోషల్ మీడియా ద్వారా ప్రారంభం అయ్యాయి. ఇందులో ఒక పోస్ట్‌లో మహియెకా షేర్ చేసిన ఒక సెల్ఫీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక వ్యక్తి బ్లర్‌గా కనిపించాడు. అయితే అతడు హార్దిక్ పాండ్యానే అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అంతేగాకుండా మహియెకా పోస్ట్‌లలో ఎక్కడో హార్దిక్ జెర్సీ నంబర్ 33 కనిపించడాన్ని కూడా ఒక యూజర్ గుర్తించారు.
మరోవైపు ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తూ.. హార్దిక్, మహియెకా ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు ఫాలో అవుతున్నారని అభిమానులు గమనించారు. కొన్ని ఫోటోలలో ఇద్దరూ ఒకే రకమైన బాత్రోబ్ ధరించినట్లు కూడా గుర్తించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా నెటిజన్లు సోషల్ మీడియాలో బయటపెట్టారు. ఆసియా కప్ కోసం హార్దిక్ దుబాయ్‌లో ఉన్న సమయంలో మహియెకా కూడా అక్కడికి వెళ్లినట్లు వార్తలు రావడంతో ఈ పుకార్లు మరింత పెరిగాయి. ఇప్పుడు రొమాంటిక్ బీచ్ ఫొటో వీరిద్దరి మధ్య బంధం గురించి వచ్చిన రూమర్స్‌కు బలం చేకూర్చింది.
Also Read..
Amanjot Kaur | ‘మా నానమ్మ బతికే ఉంది’.. దయచేసి తప్పుడు వార్తలు ప్రచారం చేయకండి..!
ఇది సార్ అమ్మాయిల బ్రాండ్.. మహిళా క్రికెటర్ల కోసం క్యూ కడుతున్న కంపెనీలు
Anmol Mazumdar | వరల్డ్ కప్ కోచ్‌కు ఘన స్వాగతం.. ‘గార్డ్ ఆఫ్ హానర్’ వీడియో చూసేయండి..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SIR | ప్రపంచమంతా ‘జంతర్ మంతర్’! సర్‌కు వ్యతిరేకంగా అనేక దేశాల్లో ప్రవాస భారతీయుల నిరసనలు
India vs Zimbabwe T20I | అమ్మాయిలు అదుర్స్.. దంచికొట్టిన షెఫాలీ, మంధాన.. రెండో టీ20లో భారత్ ఘన విజయం
Saddula Bathukamma | అంబరాన్నంటిన సద్దులు.. ట్యాంక్‌బండ్‌పై ఘనంగా వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా రష్మిక-విజయ్ జంట
BRS | బీఆర్ఎస్ దెబ్బకు దిగొచ్చిన జీఆర్ఎంబీ.. ఏపీ ప్రతిపాదనలు తిరస్కరణ
Crop Losses | పంట నష్టం.. 20,000 కోట్లు..! సాగునీటి కొరత.. విద్యుత్తు కోతలతో రాష్ట్రవ్యాప్తంగా ఎండుతున్న పంటలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

