బ్యాంక్ తరలించొద్దని గ్రామస్తుల ధర్నా
జాజిరెడ్డిగూడెం గ్రామంలో అనేక సంవత్సరాలుగా ప్రజలకు సేవలందిస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శాఖను వేరే ప్రాంతానికి తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం జాజిరెడ్డిగూడెంలో గ్రామ ప్రజలు...
– బ్యాంకు తరలింపు కోసం వేసిన టెండర్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్
అర్వపల్లి, నవంబర్ 04 : జాజిరెడ్డిగూడెం గ్రామంలో అనేక సంవత్సరాలుగా ప్రజలకు సేవలందిస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శాఖను వేరే ప్రాంతానికి తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం జాజిరెడ్డిగూడెంలో గ్రామ ప్రజలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ… 1985 నుండి జాజిరెడ్డిగూడెంలో కొనసాగుతున్న ఈ శాఖ ద్వారా గ్రామంలోని రైతులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు బ్యాంకింగ్ సేవలు పొందుతున్నారని తెలిపారు. బ్యాంకు శాఖను వేరే ప్రాంతానికి తరలిస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకు తరలింపునకు సంబంధించి ఇప్పటికే వేసిన టెండర్లను తక్షణమే రద్దు చేయాలని, జాజిరెడ్డిగూడెం గ్రామంలోనే SBI బ్యాంకు శాఖను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రజల అవసరాలు, ఖాతాదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బ్యాంకు అధికారులు నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా బ్యాంకును తరలించేందుకు ప్రయత్నిస్తే గ్రామ ప్రజలందరినీ కలుపుకుని పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బ్యాంక్ తరలించొద్దని గ్రామస్తుల ధర్నా
జయశంకర్ భూపాలపల్లి జిల్లా డాన్సర్స్ యూనియన్ నూతన కమిటీ ఎంపిక
SKN | రాధికా ఆప్టే వ్యాఖ్యలపై ఎస్కేఎన్ ఫైర్.. పాత వీడియోతో నిర్మాతకు నెటిజన్ల కౌంటర్!
Suicides | అనంతపురం జిల్లాలో విషాదం.. రైలు కిందపడి తల్లి, ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య..!
Guwahati Hotel Firing: గౌహతి హోటల్ ఫైరింగ్ కేసులో ప్రధాన నిందితుడి ఎన్కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

