
పూడూరు, డిసెంబర్ 12: రైతులు యాసంగి సీజన్లో వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగుచేయాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల సూచించారు. ఆదివారం ఆమె పూడూరులోని కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. రైతులకు ఇబ్బందుల్లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. యాసంగి సీజన్లో పండించే ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఐ ద్వారా కొనుగోలు చేయబోదని, అందువల్ల రైతులు వరికి బదులుగా ఇతర పంటలను సాగు చేసి లాభాలు పొందాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రాజేశ్వర్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ విమల, ఏవో సామ్రాట్రెడ్డి, మల్లేశం, రైతులు ఉన్నారు.