కొడంగల్, అక్టోబర్ 29: జిల్లాను కరోనా రహిత జిల్లాగా మార్చుకుందామని డిప్యూటీ డీఎం అండ్‌హెచ్‌వో డా. రవీంద్రయాదవ్ అన్నారు. జిల్లా పరిధిలో మొత్తం ఏడు లక్షల మందికి పైగా వ్యాక్సిన్ వేసుకోవాల్సి ఉండగా, ప్ర స్తుతం ఐదు లక్షల మందికి వ్యాక్సిన్ వేసినట్టు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ లేనిపోని అపోహలతో కొంతమంది వ్యాక్సిన్ వేసుకోవడం లేదని తెలిపారు. వ్యాక్సిన్ వేసుకుంటేనే కరోనా నుంచి ఆరోగ్యా న్ని కాపాడుకోవచ్చని స్పష్టం చేశారు. ఎటువంటి అనుమానాలు ఉన్నా వైద్యుల సలహా తీసుకొని వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందుకు రావాలని కోరారు.
ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి
పరిగి టౌన్, అక్టోబర్ 29 : 18 సంవత్సరాల పైబడిన ప్ర తి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఎంపీపీ కరణం అరవింద్‌రావు సూచించారు. మండల పరిధిలోని రంగంపల్లి గ్రామంలో ఆయన పర్యటించారు. ఇప్పటి వర కు వ్యాక్సిన్ వేయించుకోని వారందరూ తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని చెప్పా రు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మిదేవి, వైస్‌ఎంపీపీ సత్యనారాయ ణ, ఎంపీడీవో శేషగిరిశర్మ, ఎంపీవో దయానంద్ ఉన్నారు.
రెండు డోసులు వేసుకోవాలి
కులకచర్ల, అక్టోబర్ 29 : ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని కులకచర్ల పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కులకచర్ల మండల కేంద్రంలో గ్రా మస్తులకు ప్రభుత్వ ఆరోగ్యకేంద్రంలో కొవిడ్ వ్యాక్సిన్ వేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరో నా వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు ప్రతి ఒక్క రూ రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు.
వంద శాతం వ్యాక్సినేషన్ కావాలి
కోట్‌పల్లి, అక్టోబర్ 29: కరోన రహిత సమాజ నిర్మాణం కోసం ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నూరుశాతం నిర్వహించేందుకు ఇచ్చిన బాధ్యతలను సక్ర మంగా నిర్వహించాలని సూపర్వైజర్ తులసి అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు. మండలంలోని లింగంపల్లి గ్రామంలో సెక్టార్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూరుశాతం వ్యాక్సినేషన్ వేసుకునేందుకు ఇం టింటికీ అవగాహన కల్పించేందుకు అంగన్వాడీలు కృషి చేయాలని సూచించారు.
సద్వినియోగం చేసుకోండి
దౌల్తాబాద్, అక్టోబర్ 29: ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శి శ్రీశైలం అన్నారు. శుక్రవారం దేవర్‌ఫస్లవాద్ గ్రామంలో ఏఎన్ ఎం, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు ఇంటింటీ ప్ర చారం చేశారు. ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం వ్యాక్సినేషన్ పై స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నదని ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసు కోవాలని సూచించారు.