పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా తెలంగాణ సర్కారు సకల సౌకర్యాలతో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేపడుతున్నది. వికారాబాద్ జిల్లా పరిధిలో ‘డబుల్’ ఇండ్ల నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. సాధ్య మైనంత త్వరగా అర్హులకు అందించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల కలెక్టర్ నిఖిల ఉన్నతాధికారులతో సమావేశమై డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంపై సమీక్షించారు. పనుల్లో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 1,893 ఇండ్ల పనులు వివిధ దశల్లో కొనసాగు తుండగా.. కులకచర్ల మండలం అడవి వెంకటాపూర్ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తయింది. నాణ్యతా ప్రమాణాల్లో రాజీ పడకుండా అధికారుల పర్యవేక్షణలో ఇండ్ల నిర్మాణం చేపడుతున్నారు.
పరిగి, అక్టోబర్ 29: పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు సర్కారు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని చేపడుతున్నది. నిరుపేదలకు నీడ సదుపాయం కల్పించాలన్న సదుద్దేశంతో సీఎం కేసీఆర్ ఆలోచనావిధానాలకు అనుగుణం గా చేపట్టిన రెండు పడకల ఇండ్ల నిర్మాణ పను లు వికారాబాద్ జిల్లా పరిధిలో వేగంగా కొనసాగుతున్నాయి. సాధ్యమైనంత త్వరగా నిర్మాణ పనులను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి వికారాబాద్ కలెక్టర్ నిఖిల ఇటీవల ఉన్నత స్థాయి అధికారుల సమావేశాన్ని నిర్వహించి ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. వికారాబాద్ జిల్లాకు ఇప్పటివరకు 3,873 రెండు పడకల ఇండ్లు మంజూరు కాగా, రూ. 18.47కోట్ల నిధులు మంజూరయ్యాయి.
జిల్లాకు 3,873 ఇండ్లు మంజూరు
వికారాబాద్ జిల్లాకు ఇప్పటివరకు 3,873 రెండు పడకల ఇండ్లు మంజూరయ్యాయి. ఇం దుకు సంబంధించి ఆయా నియోజకవర్గాల వా రీగా ఇండ్లను కేటాయించి, 3,632 ఇండ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. అందులో 1,893 ఇండ్ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నా యి. చేవెళ్ల నియోజకవర్గంలోని నవాబుపేట్ మండలానికి 228 ఇండ్లు, పరిగి నియోజకవర్గానికి 510 ఇండ్లు, పరిగి పట్టణ శివారులో 300 ఇండ్లు, మండలాల్లో 210 ఇండ్లు, కొడంగల్‌కు 373 ఇండ్లు, కొడంగల్ పట్టణ పరిధిలో 300 ఇండ్లు, గ్రామీణ ప్రాంతా ల్లో 73 ఇండ్లు, తాండూరు నియోజకవర్గానికి 1,761ఇండ్లు మంజూరు కాగా, తాండూరు పట్టణ పరిధిలో 1,001 ఇండ్లు, గ్రామీణ ప్రాంతాల్లో 760 ఇండ్లు, వికారాబాద్ నియోజకవర్గానికి 1,001 ఇండ్లు మం జూరు కాగా, పట్టణ ప్రాంతంలో 401 ఇండ్లు, గ్రామీణ ప్రాంతాల్లో 600 ఇండ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
వేగంగా ఇండ్ల నిర్మాణ పనులు
జిల్లా పరిధిలో రెండు పడకల ఇండ్ల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. జిల్లాలో 1,893 ఇండ్ల నిర్మాణ పనులు పురోగతిలో ఉండగా పరిగి నియోజకవర్గంలోని అడవివెంకటాపూర్ గ్రామంలో 30 రెండు పడకల ఇండ్ల నిర్మాణం పూర్తి కాగా, లబ్ధిదారులకు కేటాయిం చి గృహ ప్రవేశం చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి.
తాండూరు పట్టణ శివారులో చేపడుతున్న
1,001 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పను లు 85 నుంచి 90శాతం వరకు పూర్తయ్యాయి. జనవరిలోపు ఇక్కడ ఇండ్ల నిర్మాణ పనులు పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా పరిగి, మర్పల్లి, ధా రూర్, కొడంగల్ ప్రాంతాల్లో చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పనులు కూడా చురు గ్గా సాగుతున్నాయి. ఈ ఇండ్ల నిర్మాణ పనులను ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, నీటి పారుదల శాఖ, ఈడబ్ల్యూఐడీసీ ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
ఆరు నెలల్లో ఇండ్ల నిర్మాణం పూర్తి
జిల్లా పరిధిలో చేపట్టిన రెండు పడకల ఇండ్ల నిర్మాణ పనులను రా నున్న ఆరు నెలల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాకు 3,873 ఇండ్లు మంజూరు కా గా అందులో 1,893 ఇండ్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నా యి. రానున్న రెండు, మూడు నెలల్లో ఈ ఇండ్ల నిర్మాణ పనులు దాదాపుగా పూర్తవుతుంది. మి గతా ఇండ్ల నిర్మాణ పనులను కూడా వేగంగా పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నాం. ఆరు నెలల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించడం జరిగింది.
-మోతీలాల్, జిల్లా అదనపు కలెక్టర్, వికారాబాద్ జిల్లా