పరిగి, సెప్టెంబర్ 28 : భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరిగి మున్సి పల్ చైర్మన్ ముకుంద అశోక్ సూచించారు. మంగళవారం పరిగి పట్టణంలోని పలు కాలనీల్లో ఆయన పర్యటించి ప్రజలతో మాట్లాడారు. వారి ఇబ్బందులు అడి గి తెలుసు కున్నా రు. మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసినందున శిథి లావస్థలో ఉన్న ఇళ్లలో ఎవరూ ఉండ రాదని సూచించారు. అలాంటి వారి కోసం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. అత్యవసరం అయితేనే ఇంటి నుంచి బయటకు రావాలని పేర్కొన్నారు. ఏవైనా అత్యవసర సేవలకు మున్సిపల్ కార్యాలయంలో కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని, ఏవైనా ఇబ్బందులు తలెత్తితే 9966208843 నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో కమిషనర్ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.
వికారాబాద్, సెప్టెంబర్ 28: ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల తెలిపారు. మంగళవారం వికారాబాద్ పట్టణంలోని రామయ్యగూడ, ఎన్నెపల్లి వార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గులాబ్ తుఫాన్ ప్రభావంతో సోమ వారం కురిసిన భారీ వర్షం కారణంగా మున్సిపల్ పరిధిలో వివిధ కాలనీల్లో ఇండ్లల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. వరద నీరు ఇండ్లలోకి చేరడానికి గల కార ణాలను తెలుసుకొని పరిష్కారం దిశగా కృషి చేస్తామని తెలిపారు. వర్షాల పట్ల పట్టణ ప్రజలు అప్ర మత్తంగా ఉండాలని, అత్యవసరం ఉంటే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దన్నారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నా యన్నారు. చైర్పర్సన్ వెంట మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేశ్‌కుమార్, కౌన్సిలర్లు అనంత్‌రెడ్డి, ఆర్.నర్సింహులు, కృష్ణ ఉన్నారు.