పరిగి, అక్టోబర్ 27 : తెలంగాణ రాష్ర్టానికి 20 ఏండ్లు సీఎంగా కేసీఆర్ ఉం టారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజల కలలు సాకారం చేస్తున్న సీఎం కేసీఆర్ రాబోయే 20 ఏండ్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తారని చెప్పారు. వరంగల్‌లో నవంబర్ 15వ తేదీన నిర్వహించే విజయగర్జన సభకు ప్రతి గ్రామం నుంచి బస్సు ఏర్పాటు చేస్తామని, పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులందరూ బస్సుల్లోనే రావాలన్నారు. విజయ గర్జన సభకు సన్నాహకంగా బుధవారం పరిగిలోని బృందావన్ గార్డెన్లో నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ పెద్ద గ్రామా లుంటే అదనంగా బస్సులు కేటాయిస్తామన్నారు. విజయగర్జన సభకు సన్నా హకంగా ప్రతి మండలంలో పార్టీ కార్యకర్తల సమావేశాలు ఏర్పాటుచేసి, ఏ గ్రామానికి ఎన్ని బస్సులు అవసరమో జాబితా ఇవ్వాలన్నారు. అందుకు అనుగుణంగా బస్సుల కేటాయింపు ఉంటుందన్నారు. విజయగర్జనకు బయ లుదేరే ముందు ప్రతి గ్రామంలో టీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని సూ చించారు. బస్సులు రాత్రికే గ్రామాలకు చేరుకుంటాయని, 15వ తేదీ ఉద యం 6 గంటలకు గ్రామాల నుంచి బయలు దేరాల్సిందిగా ఎమ్మెల్యే చెప్పా రు. పరిగికి విజయగర్జన నిర్వహించే వరంగల్ సుమారు 250 కిలోమీటర్ల దూరం ఉంటుందని, అందువల్ల సమయానికి బయలుదేరితేనే సభాస్థలికి చేరుకుంటామన్నారు. ఆలస్యమైతే ట్రాఫిక్ పెరుగుతుందని, ప్రతి గ్రామ, మండల నాయకులందరు తమ గ్రామాలకు చెందిన బస్సులలోనే సభకు తరలిరావాల్సిందిగా ఎమ్మెల్యే సూచించారు. ఏ ఒక్కరు తమ స్వంత కార్లు, ఇతర వాహనాలు తీసుకురావద్దని చెప్పారు. ఒక ప్రాంతీయ పార్టీకి 9 పర్యాయాలు అధ్యక్షుడిగా ఎన్నికవడం గొప్ప విషయమని, సీఎం కేసీఆర్ తొమ్మిదిసార్లు పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని తెలిపారు. ఉద్యమ సమ యంలో ప్రజల బాధలు తెలుసుకున్న కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశానికే దిక్సూచిలాంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తు న్నారని అన్నారు. ప్రతి ఇంటికి ఏదో ఒక సంక్షేమ పథకం కింద లబ్ది చేకూ రిందని చెప్పారు. శాశ్వత ప్రాతిపదికన పనులు చేయడం జరుగుతుంద న్నారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో గ్రామాలు, పట్టణాల రూపు రేఖలు మారాయని ఎమ్మెల్యే తెలిపారు. దేశాన్ని సాకుతున్న రాష్ర్టాలలో తెలంగాణ ఒకటని చెప్పారు. రెండున్నర ఏండ్లల్లో ఎన్నికల హామీలన్ని నెరవేర్చనున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. పరిగిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు జరిగిందని, ఇతర హామీలు నెరవేరతాయన్నారు. తనకు ఏమి పనిలేదని, 24 గంటలు ప్రజాసేవలోనే ఉంటానని ఎమ్మెల్యే తెలిపారు. డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ అధిష్టానం సూచనలతో విజయగర్జన సభకు అందరు సిద్ధమవ్వాలని చెప్పారు. త్వరగా బయలుదేరడం ద్వారా సభా ప్రాంతానికి ముందుగా వెళ్లగలుగుతామని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమ లు, అభివృద్ధి జరుగుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు కొప్పుల నాగారెడ్డి, బి.హరిప్రియ, శ్రీనివాస్‌రెడ్డి, సీనియర్ నాయకుడు కొప్పుల అనిల్‌రెడ్డి, ఎంపీపీలు కె.అరవిందరావు, మల్లేశం, అనసూయ, సత్యమ్మ, మార్కెట్ చైర్మన్లు ఎ.సురేందర్, హరికృష్ణ, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్‌రెడ్డి, మండలాల పార్టీ అధ్యక్షులు ఆర్.ఆంజనేయులు, మహిపాల్‌రెడ్డి, శేరి రాంరెడ్డి, పెంట్యా నాయక్, బిక్షపతి, రైతుబంధు మండల అధ్యక్షులు మేడిద రాజేందర్, బోయిని లక్ష్మయ్య, పీరంపల్లి రాజు, రాజేందర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గోపాల్‌రెడ్డి, జడ్పీ మాజీ కో-ఆప్షన్ సభ్యుడు మీర్ మహ మూద్‌అలీ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.