తాండూరు, అక్టోబర్ 27: పార్టీకి వెన్నెముకగా ఉంటున్న కార్యకర్తలకు పార్టీ కూడా అండగా ఉంటుందని ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు సమీపంలోని జీపీఆర్ గార్డెన్లో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో తాం డూరు నియోజవర్గం టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. తాండూరు పట్టణంతో పాటు తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాలకు చెందిన టీఆర్ఎస్ ముఖ్య నేతలతో పాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ముఖ్య అథితిగా పాల్గొన్న ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్లో ఉన్న ప్రతి ఒక్కరిని కడుపులో పెట్టి కాపాడుకుంటామన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న ప్రతి కార్యకర్తకు సీఎం కేసీఆర్ న్యాయం చేస్తారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టడంతో ప్రజలు మెరుగైన జీవితం గడుపుతున్నారన్నారు. కులమతాలకు అతీతంగా టీఆర్ఎస్ పాలన కొనసాగుతుందని తెలిపారు. టీఆర్ఎస్ అభివృద్ధిని జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు లేని పోని ఆరోపణలు చేయడం విడ్డూరమని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలు చేప్పె మాటలను ప్రజలు నమ్మరాదన్నారు. ఎన్నికలు ఏవైనా టీఆర్ఎస్దే విజయమని ధీమా వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీకి వెన్నెముకన్నారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండదండలు ఉంటాయన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ పథకాలు దేశానికి రోల్‌మోడల్‌గా మారాయన్నారు. ప్రాణమున్నంత వరకు తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి తన సహకారం ఉంటుందన్నారు. మట్టిని నమ్మిన రైతుకు, ప్రజలను నమ్మిన రాజకీయ పార్టీకి ఓటమిలేదన్నారు. టీఆర్ఎస్ పచ్చని చెట్టు లాంటిదని, దానిని కాపాడుకుంటే మంచి పండ్లలాంటి ఫలితాలు ఇస్తుందన్నారు. ఆరున్నరేండ్లలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి దేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదన్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు వరాలుగా మారాయని పేర్కొన్నారు. పార్టీ అభ్యున్నతికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ఆవిర్భవించి రెండు దశాబ్ధాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని నవంబర్ 15న వరంగల్‌లో తెలంగాణ విజయ గర్జన నిర్వహించనున్నట్లు తెలిపారు. అందుకు టీఆర్ఎస్ శ్రేణుల అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్యమౌలిక వసతుల కల్పన సంస్థ చైర్మన్ పర్యాద కృష్ణమూర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణగౌడ్, పశుగణాభివృద్ధి చైర్మన్ నారాయణరెడ్డి, తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, వైస్ చైర్పర్సన్ దీప, తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్‌నాయక్, వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, బషీరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ అరుణ, ఎంపీపీ బాలేశ్వర్‌గుప్తా, అనురాధ, కరుణ, అనిత, జడ్పీటీసీలు మంజుల, శ్రీనివాస్‌రెడ్డి, తాండూరు పట్టణ అధ్యక్షుడు న యీం, తాండూరు మండల అధ్యక్షుడు రాందాస్, యాలాల మం డల అధ్యక్షుడు మల్లారెడ్డి, బషీరాబాద్ మండల అధ్యక్షుడు రాములునాయక్, పెద్దేముల్ మండల అధ్యక్షుడిగా కోహిర్ శ్రీనివాస్, టీఆర్ఎస్ సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.