ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు
బొంరాస్పేట, నవంబర్ 7: ప్రత్యామ్నాయ పంటల సాగుతో లాభాలొస్తున్నాయి. ఒకే రకమైన పంట సాగు చేయకుండా ఆరుతడి పంటలు వేసుకుంటే మేలు. ప్రస్తుతం మార్కెట్లో పూలు, కూరగాయలకు మంచి డిమాండ్ ఉన్నది. వీటిని సాగు చేసిన రైతు లు లాభాలను ఆర్జిస్తున్నారు. మండలంలోని మహంతిపూర్, తుంకిమెట్ల తదితర గ్రా మాల్లో బంతి, చేమంతి పూలను సాగు చేశారు. తుంకిమెట్లలో చిక్కలి హన్మయ్య నాలు గు గుంటల పొలంలో, మహంతిపూర్లో దూవు రామకృష్ణ 30 గుంటల పొలంలో బంతి పూలను సాగుచేశారు. దసరా నాటికి బంతి పూలు కాశాయి. బతుకమ్మ, దీపావళి పండుగల సమయంలో బంతి పూలకు డిమాండ్ ఏర్పడింది. పూల పంట మూడు నెలల్లో చేతికొస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో బంతి పూలు రూ.100, చేమంతి కిలో రూ. 200, గులాబీ కిలో రూ.300 ధర ఉన్నది. నీటి వినియోగంతో పూల సాగు చేయవచ్చని ఉద్యానవన శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
బంతి పూలను సాగు చేశా..
నాలుగు గుంటల్లో బంతి పూల ను సాగు చేస్తే ఖర్చు రూ.8 వేలు వచ్చింది. దసరా, దీపావళికి పూలు అమ్మగా మంచి లాభాలు వచ్చాయి. ఇంకా పూలు కాస్తున్నాయి. మహాశివరాత్రి వరకు పూలు కాస్తూనే ఉంటాయి. పూల సాగుతో లాభాలు వచ్చినందుకు సంతోషంగా ఉన్నది.