కొడంగల్, నవంబర్ 7: ‘పల్లె ప్రగతి’తో మండలంలోని రుద్రారం రూపురేఖలు మారాయి. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గ్రామం నేడు ఆదర్శంగా మారింది. రెండేం డ్ల కాలంలో దాదాపు రూ.కోటీ 30 లక్షల నిధులతో గ్రామ వీధుల్లో సీసీ రోడ్లు నిర్మించడంతో పాటు అంతర్గత రోడ్ల నిర్మాణ పనులు పూర్తి కావొస్తున్నాయి. రూ.16లక్షలతో మురుగు కాల్వలనూ నిర్మించారు. రూ.22 లక్షలతో చేపట్టిన రైతు వేదిక భవన నిర్మాణ పనులు పూర్తై ప్రారంభానికి సిద్ధంగా ఉన్నది. గ్రామపంచాయతీ నిధులు రూ.9 లక్షల 50వేలతో ట్రాక్టర్, ట్రాలీ, డోజర్‌తో పాటు ట్యాంకర్‌ను కొనుగోలు చేశారు. పల్లె ప్రకృతివనం, డంపింగ్ యార్డును నిర్మించారు. రూ.12.50 లక్షలతో వైకుంఠధామం నిర్మాణం చేపట్టగా పనులు చివరి దశలో ఉన్నాయి. గ్రామపంచాయతీకి ప్రతినెలా రూ.4లక్షల 99వేలు మంజూరవుతున్నాయి. వీటితో సైడ్‌డ్రైన్, నీటి సరఫరా వేతనాలు, విద్యుత్, మొక్కల సంరక్షణ వంటి పనులు చేస్తున్నారు. గ్రామాభివృద్ధికి ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.
ఆహ్లాదకరంగా పల్లె ప్రకృతి వనం..
పల్లె ప్రకృతి వనం ఏర్పాటుకు స్థల సేకరణలో జాప్యం వల్ల ఆలస్యంగా మొక్కలు నాటాం. హరితహారం కిం ద గ్రామంలో 4,200 మొక్కలు నాటారు. గ్రామ నర్సరీలో 15 వేల మొక్కలు సిద్ధంగా ఉన్నాయి.
గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తాం..
మరింత గ్రామాభివృద్ధికి కృషి చేస్తాం. ఇంటింటికీ తాగునీటిని అందిస్తున్నాం. మురుగు కాల్వలలను నిర్మించాం. ప్రతి వీధిలో సీసీ రోడ్డును నిర్మించాం. నిత్యం చెత్త ను సేకరించి డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నాం.