పెద్దేముల్, నవంబర్ 6: మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లోని సుమారు 46 పోలింగ్ స్టేషన్లవారీగా 18 ఏండ్లు నిండిన యువతీ,యువకుల నుంచి ఓటరు జాబితాలో పేర్ల నమోదుకు దరఖాస్తులను స్వీకరించినట్లు తహసీల్దార్ మహమ్మద్ ఫహీం ఖాద్రి తెలిపారు. శనివా రం ఆయన మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాల య ఆవరణలో 18 ఏండ్లు నిండిన యువతీ,యువకుల నుంచి ఓటరు నమోదు దరఖాస్తులను స్వీకరించి మా ట్లాడారు. 18 ఏండ్లు నిండిన యువతీ,యువకులు తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలన్నారు. ఇందుకోసం స్థానికంగా గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఓటరు నమోదు కేంద్రాల వద్ద యువతీ,యువకులు ఫారం-6తోపాటు, ఆధార్ కార్డు, ఫొటో, చదువుకొని ఉంటే బొనఫైడ్ సర్టిఫికెట్లను జత చేసి కేంద్రాల వద్ద ఉన్న బీఎల్వోలకు సమర్పించాలని ఆయన సూచించారు. అదేవిధంగా ఓట రు జాబితాలో మార్పులు, చేర్పులుంటే దానికోసం ఫా రం-7, 8లను సమర్పించాలని ఆయన సూచించారు. శని, ఆదివారాల్లో స్థానిక బీఎల్వోలు సంబంధిత గ్రామా ల్లో ఓటరు నమోదుకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తారని, అర్హులు ఈ అవకాశాన్ని సద్వి నియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ మోహన్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజురెడ్డి, అంగన్వాడీ టీచర్లు ధనలక్ష్మి, లక్ష్మి, వీఆర్ఏలు శ్రీను, నరేశ్, శ్రీకాంత్, స్థానిక యువకులు పాల్గొన్నారు.
ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలి
కొడంగల్, నవంబర్ 6: 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా తమ పేరును నమోదు చేసుకోవాలని ఇన్చార్జి తహసీల్దార్ ఆనంద్ సూచించారు. ఆయన మాట్లాడు తూ శనివారం, ఆదివారం ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసి న కేంద్రాల్లో ఓటరు నమో దు ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఆయా బూత్‌ల వారీగా కేటాయించబడ్డ బూత్ లెవల్ అధికారుల ద్వారా కేంద్రాల్లో దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఓటరు జాబితా లో తప్పిదాలు ఉంటే మార్పులు చేర్పులు చేసుకోవాలని ఆయన సూచించారు.
ఓటు హక్కును నమోదు చేసుకుందాం
యాలాల నవంబర్ 6: 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని తహసీల్దార్ గోవిందమ్మ సూచించారు. శనివారం ఆమె మాట్లాడుతూ భారత రాజ్యాంగం మనకు ఇచ్చిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. వచ్చే నెల 15వ తేదీ లోపు గడువు విధించగా ఓటు హక్కును ఆన్లైన్ ద్వారా www.ceotelangana.nic.in, www.nvsp.in నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించిందన్నారు. ఆన్లైన్ ద్వారా ఓటు హక్కును నమోదు చేసుకోవాలను కున్న వారు ముందుగా వెబ్సైట్లోకెళ్లి అవసరమైన ధ్రువీకరణ పత్రాలు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన్నారు. అదేవిధంగా 18ఏండ్లు నిండిన యువతీ,యువకులు బూత్ స్థాయి కేంద్రాల్లో బీఎల్వోల వద్ద ఉండే దరఖాస్తు ఫారాలను పూరించి అవసరమైన ధ్రువీకరణ పత్రాలు జత చేసి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఓటరు జాబితా లో మార్పులు, చేర్పులు, అభ్యంతరాలుంటే పోలింగ్ కేంద్రాల వద్ద బీఎల్వోలు, గ్రామ పంచాయతీలు, తహ సీల్దార్ కార్యాలయాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. పంచా యతీల్లో ఓటరు జాబితాను ఉంచినట్లు ఆమె తెలిపారు.
దోమ, నవంబర్ 6: స్పష్టమైన ఓటరు జాబితాను రూపొందించేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాలని వికారాబా ద్ ఆర్డీవో ఉపేందర్ అన్నారు. శనివారం దోమ తహసీల్దార్ కార్యాలయంలో ఆయ న ఓటరు నమోదుపై పంచాయతీ కార్యదర్శులు, బూత్‌లెవెల్ అధికారులతో సమీ క్షా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడా రు. స్పష్టమైన ఓటరు జాబితాను రూపొందించాలని, జనవరి 1, 2022 నాటికి 18 ఏండ్లు నిండి, ఓటరు జాబితాలో పేరు నమోదుకాని యువతీ,యువకులను నూ తన ఓటరుగా నమోదు చేయడంతోపా టు, జాబితాలో మార్పులు, చేర్పులు ఉం టే చేసి ఈ నెల 30 వరకు జాబితాను సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రాజేందర్‌రెడ్డి, ఆర్ఐ లింగం, బూత్ లెవెల్ స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
వికారాబాద్ ఆర్డీవో ఉపేందర్
కులకచర్ల, నవంబర్ 6: విధులపై నిర్లక్ష్యం చేసే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని వికారాబాద్ ఆర్డీవో ఉపేందర్ హెచ్చరించారు. శనివారం ఆయన కులకచర్ల తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన బూత్‌లెవల్ సమావేశంలో కులకచర్ల తహసీల్దార్ సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన వారి సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలన్నారు. గ్రామాల్లో బూత్‌లెవల్ ఓట ర్ల నమోదు కార్యక్రమాన్ని సక్రమంగా జరిగేలా చూడాలని తహసీల్దార్ శ్రీనివాస్‌రావుకు సూచించారు. 18 ఏండ్లు నిం డిన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా చూడాలన్నా రు. కార్యక్రమంలో బూత్‌లెవల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.