Vijayashanti | లేడి సూపర్ స్టార్ విజయశాంతి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి పని చేసిన విజయశాంతి మధ్యలో కొన్నాళ్లు సినిమాలకి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత రాజకీయాలలోకి వెళ్లింది. ఇక ఇటీవల తిరగి సినిమాలలోకి రీఎంట్రీ ఇచ్చింది. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో కీలక పాత్ర పోషించిన విజయశాంతి ఇటీవల అర్జున్ సన్ఆఫ్ వైజయంతి మూవీలో పోలీస్ పాత్ర పోషించి అలరించింది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ తల్లిగా విజయశాంతి నటించి మెప్పించారు. మరోసారి పోలీస్ పాత్రలో పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్ తో విజయశాంతి అదరగొట్టింది .
అయితే విజయశాంతి ఇటీవల పలు ప్రమోషన్ కార్యక్రమాలలో యాక్టివ్గా పాల్గొంటూ ఆసక్తికర విషయాలు తెలియజేస్తుంది.1980ల్లో సినీరంగంలో అడుగు పెట్టిన విజయశాంతి, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో పవర్ఫుల్ పోలీస్ పాత్రలతో మెప్పించింది. హీరోలకి ధీటుగా నటించిన విజయశాంతి ఆస్తులు కూడా బాగానే కూడబెట్టింది. అయితే విజయశాంతికి పిల్లలు లేరు కాబట్టి ఆమె తన ఆస్తి మొత్తాన్ని ఎవరికి పంచబోతుందనే విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో విజయశాంతి స్వయంగా ఈ విషయాన్ని మీడియాకి తెలియజేసింది.
తన తల్లి పేరుతో ఒక ఫౌండేషన్ను స్థాపించి, ఆ ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్యం రంగాలలో పలు సేవలు అందించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు విజయశాంతి తెలిపింది. ఇక నా వద్ద ఉన్న నగలు అన్నింటిని కూడా వెంకటేశ్వర స్వామి హుండీలో.. సమర్పించనున్నట్టు తెలిపింది. ఇక విజయశాంతి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంద.సమాజానికి తన ఆస్తిని పంచడమే కాక, తన తల్లి పేరుతో సామాజిక సేవలు చేయాలని ఆమె నిర్ణయించుకోవడం చాలా గొప్ప విషయం అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక విజయశాంతి రానున్న రోజులలో సినిమాలు చేయదని సమాచారం.