Liger Attitude Glimps | ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘లైగర్’ ఒకటి. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించాడు. ఈ కాంబోలో సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన ట్రైలర్ సంచలనం సృష్టించిందని చెప్పొచ్చు. ఇప్పటివరకు ట్రైలర్ దాదాపు 6కోట్లకు పైగా వ్యూస్‌ను సాధించి యూట్యూబ్‌లో ట్రెండింగ్స్‌లో ఉంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్డేట్లను ప్రకటిస్తూ సినిమాపై అంతకంతకు అంచనాలు పెంచుతున్నారు. తాజాగా మేకర్స్ మరో బిగ్ అప్డేట్ను ప్రకటించారు.
లైగర్ చిత్రం నుండి ‘ది యాటిట్యూడ్ ఆఫ్ లైగర్’ గ్లింప్స్‌ను శుక్రవారం ఉదయం 9గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో విజయ్, రమ్యకృష్ణ ఒక చోట కూర్చుని చెరోవైపు చూస్తున్నారు.ఈ సినిమా ముంబైలోని ఓ చాయ్ వాలా ప్రపంచం గుర్తించే బాక్సర్‌గా ఎలా ఎదిగాడు అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. ఈ చిత్రంలో విజయ్‌కు జోడీగా అనన్యపాండే హీరోయిన్గా నటించింది. కరణ్‌జోహర్, ఛార్మీతో కలిసి పూరి స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ కీలకపాత్రలో నటించాడు. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
July 29th. 9 AM.
The Attitude of #Liger! #WaatLagaDenge pic.twitter.com/sJAGC1vrAm— Vijay Deverakonda (@TheDeverakonda) July 27, 2022