న్యూఢిల్లీ : పంజాబీ పాటలకు ప్రత్యేకంగా పెద్దసంఖ్యలో అభిమానులు ఉంటారనడంలో సందేహం లేదు. ఆకట్టుకునే ట్యూన్స్‌తో అద్భుతమైన లిరిక్స్‌తో పంజాబీ పాటలు స్వచ్ఛమైన వినోదం అందిస్తూ అలరిస్తుంటాయి. పంజాబ్ రాష్ట్రం జలంధర్‌లోని ఓ పెట్రోల్ అవుట్‌లెట్‌లో ఎల్ఈడీ డిస్ప్లే బోర్డుపై ఎక్సూజెస్ లిరిక్స్ ప్లే అయిన వీడియో (Viral Video) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జలంధర్‌లోని భారత్ పెట్రోల్ పంప్లో ఈ ఘటన జరగ్గా వైరల్ క్లిప్‌ను ఇప్పటివరకూ 20 లక్షల మందికి పైగా వీక్షించారు. ఏపీ థిల్లాన్ సాంగ్‌ను వేకప్సింగ్ అనే యూజర్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా సాగరిక అనే యూజర్ రీషేర్ చేశారు.
ఈ వీడియోలో ఎక్సూజెస్ సాంగ్‌లోని కెహింది హుంది సీ, ట్యాంక్ ఫుల్ కరాదే అనే లిరిక్స్ డిస్ప్లే బోర్డుపై దర్శనమిచ్చాయి. మార్కెటింగ్ ఆన్ పాయింట్ అని ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఎక్సూజెస్ సాంగ్‌ను ఏపీ థిల్లాన్, గురీందర్ గిల్ ఆలపించారు.