కోల్కతా, అక్టోబర్ 14: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పశ్చిమ బెంగాల్ వైద్య విద్యార్థిని సామూహిక లైంగిక దాడి ఘటన (దుర్గాపూర్ కేసు)లో పోలీసుల విచారణ కొత్త మలుపు తీసుకుంది. మంగళవారం బాధితురాలి స్నేహితుడ్ని పోలీసులు అరెస్టు చేశామని అసన్సోల్-దుర్గాపూర్ పోలీస్ కమిషనర్ సునీల్ కుమార్ చౌదరీ విలేకర్లకు తెలిపారు. దుర్గాపూర్ కేసులో అరెస్టయిన వారి సంఖ్య ఆరుకు చేరుకుంది. అయితే ఈ కేసులో స్నేహితుడే అసలైన దోషిగా ఆరోపణలు వెలువడుతున్నాయి. వైద్య విద్యార్థిని తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోనూ అతడి పేరునే ప్రధానంగా ప్రస్తావించాడు.