రామాయంపేట, జూలై 19 : పశువులకు చర్యవ్యాధి రాకుండా ముందస్తుగా టీకాలు వేస్తున్నట్లు డి.ధర్మారం పశు వైద్యుడు శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం మండలంలోని డి.ధర్మారం గ్రామంలో పశువైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పశువులకు ముద్ద చర్మవ్యాధి రాకుండా చికిత్సలు నిర్వహించి టీకాలును వేశారు. అనంతరం డా.శ్రీనివాస్ మాట్లాడుతూ పశువులకు వ్యాధి సోకకుండా పశువులు ఉన్నవారు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు.
ఎక్కువగా పశువులకు చర్మంపై గడ్డలు అధికంగా జ్వరం రావడంతో పాటు పాలు తక్కువగా ఇస్తాయని, అందు కోసం పాడి పశువులకు వ్యాధి సోకిన వెంటనే వైద్యాధికారిని సంప్రదించాలన్నారు. మండలంలోని పాడి రైతులందరూ తమ పశువులకు పరీక్షలు చేయించాలని సూచించారు. ఈ వ్యాధులు ఎక్కువ శాతం వానాకాలంలోనే వస్తాయన్నారు.