అరబిందో చేతికి వెరిటాజ్ హెల్త్‌కేర్
- రూ.171 కోట్లకు కొనుగోలు
హైదరాబాద్, మార్చి 28: హైదరాబాదీకి చెందిన సంస్థ అరబిందో ఫార్మా..ఇదే నగరానికి చెందిన మరో ఫార్మా కంపెనీ వెరిటాజ్ హెల్త్‌కేర్‌ను కొనుగోలు చేసింది. రూ.171 కోట్ల నగదు చెల్లింపుతో వెరిటాజ్ వ్యాపారాన్ని, కొన్ని ఆస్తుల్ని టేకోవర్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు అరబిందో సోమవారం స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది. 2022 ఏప్రిల్ 1 నుంచి ఈ లావాదేవీ అమలులోకి వస్తుందని, మే నెలకల్లా పూర్తవుతుందన్నది. దేశీ మార్కెట్లో వెరిటాజ్ వివిధ బ్రాండెడ్ జనరిక్ ఫార్ములేషన్స్, ఇతర హెల్త్‌కేర్ సంబంధిత ఉత్పత్తుల్ని విక్రయిస్తున్నది. 23 నగరాల్లో 50 వేలకుపైగా రిటైలర్లను కవర్ చేస్తూ సేల్స్, డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. దేశంలో బయోసిమిలర్, తదితర ఉత్పత్తుల్ని తాము ప్రవేశపెట్టేందుకు వెరిటాజ్ టేకోవర్ సహాయపడుతుందని అరబిందో విడుదల చేసిన ప్రకటన తెలిపింది. దేశీ ఫార్ములేషన్స్ మార్కెట్లో విస్తరించాలన్న కంపెనీ లక్ష్యంలో భాగంగా ఈ లావాదేవీ జరిపామన్నది. 2021 ఆర్థిక సంవత్సరంలో వెరిటాజ్ రూ.127.02 కోట్ల టర్నోవర్ సాధించిందని, 2022 ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో ఆదాయం రూ.133.18 కోట్లకు పెరిగినట్టు అరబిందో వెల్లడించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

