ఖైరతాబాద్, ఏప్రిల్ 17 : సింగర్ మంగ్లీపై అసత్యపు ఆరోపణలు మానుకోవాలని సేవా లాల్ బంజారా సంఘం ముఖ్య సలహాదారుడు వెంకట్ డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజన జాతిలో పుట్టిన సింగర్ మంగ్లీ వివిధ భాషల్లో పాటలు పాడుతూ అంచలంచెలుగా ఎదిగిందని, అది చూసి ఓర్వలేక ఆమెపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు.
కొన్ని సామాజిక మాద్యమాల్లో ట్రోల్ చేయడం బాధాకరమన్నారు. న్యాయవాది సుబ్బారావు మంగ్లీపై చేస్తున్న ఆరోపణల్లో ఆధారాలు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు. దీనిని కుల వివక్ష దాడిగా భావిస్తున్నా మన్నారు. ఈ సమావేశంలోగణేశ్ నాయక్, మోహన్ నాయక్, గిరిజన జన సమతి రాష్ట్ర అధ్యక్షుడు వివేక్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.