వరంగల్‌చౌరస్తా, ఏప్రిల్17 : ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ జనరల్ సర్జరీ పేపర్-1 పరీక్షను రద్దు చేస్తున్నట్లు వరంగల్‌లోని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ వై.మల్లేశ్వర్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయనొక ప్రకటన విడుదల చేశారు. కాళోజీ హెల్త్ యూనివర్సిటీ 2026 ఫిబ్రవరి 9వ తేదీన వెలువడిన నోటిఫికేషన్ ఆధారంగా ఏప్రిల్ 15వ తేదీన నిర్వహించిన ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ పేపర్-1లో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయని తెలిపారు.
దీని కారణంగా పరీక్షను రద్దు చేశామని, తిరిగి అదే పరీక్షను 2026 ఏప్రిల్ 27వ తేదీన యదావిథిగా అవే పరీక్షా కేంద్రాల్లో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ పేపర్-1 జనరల్ సర్జరీ పరీక్షను నిర్వహిస్తామని ఆయన తెలిపారు. అయితే యూనివర్సిటీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని విద్యార్ధులు వ్యతిరేకిస్తున్నారు. సాంకేతిక సమస్య కారణంగా పేపర్-2 సిలబస్‌కు సంబంధించిన ప్రశ్నలు పేపర్-1లో రావడం అధికారులు తప్పిదమే కారణమైనపుడు అందుకు సరైన మార్కులను జోడించడం ద్వారా సమస్యను పరిష్కరిస్తే సరిపోతుందంటున్నారు.