కారకాస్ : వెనెజువెలా అధ్యక్షుడు మదురో సాయిబాబాకు భక్తుడు. 2005లో వెనెజువెలా విదేశాంగ మంత్రిగా మదురో తన భార్యతో కలిసి పుట్టపర్తికి వచ్చి సాయిబాబా నుంచి ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఆనాటి పర్యటనలో సత్యసాయిని ప్రత్యేకంగా కలిశారు. దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సైమన్ బొలివర్, హ్యూగో చావెజ్ ఫొటోలతో పాటు సాయిబాబా నిలువెత్తు ఫొటోను తన అధ్యక్ష ప్యాలెస్లో ఉంచారు.
మదురో కంటే ముందు ఆయన భార్య సాయికి భక్తురాలిగా ఉండేవారు. ఆమె ప్రభావంతో ఆయన కూడా బాబా భక్తుడిగా మారినట్టు తెలిసింది. 2011లో సాయిబాబా మరణించినప్పుడు జాతీయ అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టడంలో మదురో కీలక పాత్ర పోషించారు. ఒకరోజు సంతాప దినం ప్రకటించి ఆధ్యాత్మిక గురువు పట్ల తన భక్తి చాటుకున్నారు.