న్యూఢిల్లీ: జాతీయ రహదారులపై టోల్ చెల్లింపు నిబంధనలను కేంద్రం మంగళవారం కఠినతరం చేసింది. టోల్ బకాయిలు ఉన్న వాహనాలకు నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్లు(ఎన్వోసీ), ఫిట్నెస్ సర్టిఫికెట్లు, జాతీయ పర్మిట్లు సహా కీలక రిజిస్ట్రేషన్, పర్మిట్ సంబంధిత అత్యవసర సేవలను నిరాకరించనున్నట్లు కేంద్రం తెలిపింది. కేంద్ర మోటరు వాహనాల నిబంధనలు, 1989 స్థానంలో అమల్లోకి రానున్న కేంద్ర మోటారు వాహనాల(రెండవ సవరణ) నిబంధనలు, 2026 ద్వారా ఈ మార్పులను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. టోల్ ఎగవేతలను నిర్మూలించి హైవేలపై నిరాటంక ప్రయాణానికి మార్గం సుగమం చేస్తూ ఎలక్ట్రానిక్ టోల్ వసూలును బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ మార్పులు తీసుకువచ్చింది.