హైదరాబాద్ : ముక్కోణపు వన్డే సిరీస్‌లో (Tri-Nation Series) భాగంగా శ దంబుల్లా వేదికగా శ్రీలక-ఏతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసకరమైన బ్యాటింగ్ ప్రదర్శనతో ఇండియా -A పటిష్ట స్థితికి చేరుకుంది. 27 ఓవర్లలో 215 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇద్దరు వైభవ్, ప్రియాన్ష్ అవుట్ అయ్యారు. తిలక్ వర్మ 55 బంతుల్లో (41), రుతురాజ్ గైక్వాడ్ 49 బంతుల్లో (31) పరుగులతో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నారు. అంతకు ముందుకు ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్ కేవలం 11 బంతుల్లోనే అర్థశతకం (50) పూర్తి చేశాడు.
దీంతో వైభవ్ లిస్ట్-ఎ (List-A) క్రికెట్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 4, 4, 4, 6, 6, 6 వరుస బౌండరీలతో లంక బౌలర్లను ఊచకోత కోశాడు. షిరాజ్ ఓవర్లో 3 సిక్స్‌లు, 2 ఫోర్లుతో ఏకంగా 26 పరుగులు పిండుకున్నాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిన వైభవ్ తృటిలో సెంచరీ మిస్సయాడు. కేవలం 29 బంతుల్లో (10 ఫోర్లు, 8 సిక్సర్లు) 94 పరుగులు చేసి సహాన్ బౌలింగ్‌లో వియస్కాంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి చ్చిన తిలక్, గైక్వాడ్ నిలడగా ఆడుతున్నారు.