హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలో ప్రాథమిక ఇంధనాన్ని వినియోగిస్తున్న దేశాల్లో అమెరికా, చైనా తర్వాత భారత్ మూడో స్థానంలో నిలిచిందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర పేరొన్నారు. న్యూఢిల్లీలో చైర్మన్ సునీల్ దత్తాత్రేయ తటరే అధ్యక్షతన గురువారం జరిగిన పెట్రోలియం, సహజవాయువు పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశంలో ‘పెట్రోలియం రంగంలో పర్యావరణ సమస్యలు’ అంశంపై వద్దిరాజు మాట్లాడారు.
భారత ఇంధన మిశ్రమంలో సహజవాయువు వాటాను 2030 నాటికి 6 శాతం నుంచి 15 శాతానికి పెంచే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నదని, దానికి అనుగుణంగా గ్యాస్ పైప్లైన్లు, రిఫైనరీల వినియోగం పెంపు, దేశవ్యాప్త గ్యాస్ పంపిణీ నెట్వర్ విస్తరణ వంటి మౌలిక సదుపాయాల కల్పన మరింత ముమ్మరంగా సాగాలని సూచించారు.