నెక్కొండ/వరంగల్ చౌరస్తా, నవంబర్ 23: జిల్లావ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటరమణ వైద్య సిబ్బందికి సూచించారు. మంగళవారం ఆయన నెక్కొండ మండలం పెద్దకోర్పోలులో వ్యాక్సినేషన్ పురోగతిని పరిశీలించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మహబూబ్‌పాషా, వార్డు సభ్యులు, వైద్య సిబ్బందితో సమీక్షించారు. వందశాతం లక్ష్యాన్ని సాధించాలని, ఎలాంటి భయం లేకుండా అందరూ టీకాలు వేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు.
సమీక్షలో అలంకానిపేట పీహెచ్సీ వైద్యాధికారి సుమంత్‌కుమార్, హెచ్‌ఈవో జమాల్, సూపర్వైజర్ రాజు, హెల్త్ అసిస్టెంటెంట్ శోభన్, ఏఎన్ఎం కరుణ పాల్గొన్నారు. కాగా, జిల్లావ్యాప్తంగా 184 మంది సిబ్బందితో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు డీఎంహెచ్‌వో తెలిపారు. మంగళవారం 4068 మందికి వ్యాక్సిన్ వేశామని చెప్పారు. 2438 మందికి మొదటి డోసు, 1630 మందికి రెండో డోసు టీకాలు వేశామన్నారు. ఇప్పటివరకు 1,92,399 మందికి మొదటి డోసు, 1,01,364 మందికి సెకండ్ డోసు వ్యాక్సిన్ వేసినట్లు వెల్లడించారు. 269 గ్రామాలు, 31 కాలనీల్లో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయిందన్నారు.
వ్యాక్సినేషన్‌తోనే కరోనాకు అడ్డుకట్ట
వ్యాక్సినేషన్‌తోనే కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేయొచ్చని ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు అన్నారు. ఖానాపురం మండలం కొత్తూరు వాసులకు వందశాతం వ్యాక్సిన్ పూర్తి చేయడంతో సబ్సెంటర్లో వైద్య సిబ్బందిని ఎంపీపీ అభినందించారు. గ్రామంలో 1459 మంది అర్హులు ఉండగా, అందరికీ టీకాలు వేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు బూస రమ, బాషబోయిన ఐలయ్య, అశోక్, మండల వైద్యాధికారి మల్యాల అరుణ్‌కుమార్, ఉపసర్పంచ్ వీరపాక స్వామి, కార్యదర్శి స్రవంతి, పోతరాజు కుమార్, యాకయ్య, డేవిడ్, వైద్య సిబ్బంది సుజాత, సులోచన, సుమలత, సంధ్య, వెంకటమ్మ పాల్గొన్నారు. నర్సంపేట మండలంలోని భాంజీపేట పీహెచ్సీ ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి టీకాలు వేస్తున్నారు. గురిజాల, ముగ్ధుంపురం, పాతముగ్ధుంపురం, రాజుపేటలో వ్యాక్సినేషన్‌ను సర్పంచ్‌లు మమత, జ్యోతి, లావణ్య, బానోత్ దస్రూ పరిశీలించారు.