పంటలను ఎండబెడుతున్న కాంగ్రెస్.. కరెంటు, నీళ్లు ఇవ్వడం చేతగాని రేవంత్
రైతులకు సాగునీరు, కరెంటు ఇవ్వడం చేతకాక కాంగ్రెస్ సర్కార్ పంటలను ఎండబెడుతున్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
- సొంత జిల్లాను బాబుకు తాకట్టు పెట్టిన సీఎం
- హన్వాడలో ఎండిన పంటలను పరిశీలించిన శ్రీనివాస్‌గౌడ్
- మునిమోక్షం సబ్‌స్టేషన్ ఎదుట రైతులతో కలిసి ధర్నా
మహబూబ్‌నగర్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైతులకు సాగునీరు, కరెంటు ఇవ్వడం చేతకాక కాంగ్రెస్ సర్కార్ పంటలను ఎండబెడుతున్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మహబూబ్‌నగర్ నియోజకవర్గం హన్వాడ మండలం మాధారం, కొమ్మిరెడ్డిపల్లి, మునిమోక్షం గ్రామాల్లో ఎండిన పంటలను పరిశీలించారు. అనంతరం రైతులతో కలిసి మునిమోక్షం సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన సొంత జిల్లాను పొరుగు రాష్ట్ర సీఎం చంద్రబాబుకు తాకట్టుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, దీంతో పాలమూరు మళ్లీ వలసబాట పట్టే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. క్రాప్హాలిడేలు ప్రకటించి రాష్ర్టాన్ని పదేండ్ల్లు వెనక్కి నెట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎండిన ప్రతి ఎకరా పంటకూ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇది ఎల్ నినో ప్రభావంతో వచ్చిన కరువు కాదని, ముమ్మాటికీ కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన కరువు అని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే పంటలు ఎండిపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఎండిన పంటల పరిశీలన
మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో హన్వాడ మండల పరిధిలోని గ్రామాల్లో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఎండిపోయిన పంటలను పరిశీలించారు. తాను నాలుగు ఎకరాల్లో సాగు చేసిన పంట ఎండిపోవడంతో దానిని పశువుల మేతకు వదిలేశానని మాధారం గ్రామానికి చెందిన ఒక రైతు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం కొమ్మిరెడ్డిపల్లి గ్రామానికి చేరుకొని అక్కడి రైతుల పొలాలను పరిశీలించారు. సుమారు 28 ఎకరాల్లో నలుగురు అన్నదమ్ములు కలిసి వరి సాగు చేస్తే కనీసం 4 ఎకరాల్లో కూడా పంట దక్కే పరిస్థితి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికే రూ.8,40,000 పెట్టుబడి పెట్టామని సదరు రైతులు వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

