అన్నదాతకు అగ్ని పరీక్ష!
రాష్ట్రంలో రైతన్న అరిగోస పడుతున్నాడు. ప్రభుత్వ నిర్వాకానికి అన్నదాత అష్టకష్టాలు ఎదుర్కోవాల్సి వస్తున్నది. ఈ సీజన్లో పంట వేసినప్పటి నుంచి ఇటు కరెంట్ కోతలు, అటు నీటి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. పంటను బతికించుకోవడానికి ప్రభుత్వాన్ని వేడుకున్నా.. అధికారుల కాళ్లు పట్టుకున్నా ఫలితం ఉండటం లేదు.
రాష్ట్రంలో రైతన్న అరిగోస పడుతున్నాడు. ప్రభుత్వ నిర్వాకానికి అన్నదాత అష్టకష్టాలు ఎదుర్కోవాల్సి వస్తున్నది. ఈ సీజన్లో పంట వేసినప్పటి నుంచి ఇటు కరెంట్ కోతలు, అటు నీటి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. పంటను బతికించుకోవడానికి ప్రభుత్వాన్ని వేడుకున్నా.. అధికారుల కాళ్లు పట్టుకున్నా ఫలితం ఉండటం లేదు. దీంతో ట్యాంకర్లతో పంటను బతికించుకోవడానికి తిప్పలు పడుతున్నాడు. అయినా నీళ్లు సరిపోక, కరెంట్ లేక పంట ఎండిపోతున్నాయి. దీంతో రేవంత్ సర్కార్‌పై ఉన్న కోపంతో పంటకు నిప్పు పెడుతున్నాడు.
నాగర్‌కర్నూల్, నల్లగొండ జిల్లాలకు జీవనాధారమైన డిండి ప్రాజెక్టు నీళ్లులేక వెలవెలబోతున్నది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఈ వానకాలంలో పూర్తిస్థాయిలో నీళ్లు చేరకపోవడంతో కళ తప్పింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎప్పుడూ నీటితో కళకళలాడిన ప్రాజెక్టు, కాల్వలు నేడు బోసిపోయాయి. రైతుల పశువులు, మేకలు మేపుతున్నారు. సమీప గ్రామాల్లో భూగర్భ జలాలు తగ్గాయి. బోర్లు సైతం ఎండిపోయాయి. దీంతో ప్రాజెక్టు కింద 10 వేల ఎకరాల్లో సాగు చేసిన వరి పంట ప్రశ్నార్థకంగా మారింది.
– వంగూరు
- కడుపు మండి పంటకు నిప్పు

మహబూబ్‌నగర్ జిల్లా పాన్‌గల్ మండలం మాధవరావుపల్లి శివారులో వరి పంటకు నిప్పంటించిన రైతు నరసింహ నాయుడు

మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం కొనగట్టుపల్లి గ్రామ శివారులో ఎండిన వరి కంకులను చూపుతున్న రైతులు

పెద్దపల్లి జిల్లా మూలసాల గ్రామంలో నీళ్లు లేక ఎండిన పొలంలో మేత మేస్తున్న మేకలు
- పంటల కోసం రైతన్న పాట్లు

రంగారెడ్డి జిల్లాలో ట్యాంకర్ ద్వారా వరి పంటకు నీటిని అందిస్తున్న రైతు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

