ఇటిక్యాల/అలంపూర్, ఏప్రిల్ 12 : రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ఎదురొడ్డి నిలిచేది, గెలిచేది బీఆర్ఎస్ పార్టీయేనని ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నా రు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన కేసీఆర్ నాయకత్వంలో సైనికుల్లా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. ఇటిక్యాల మండలం కొండేర్ గ్రా మంలో ఎమ్మెల్యే అధ్యక్షతన బుధవారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి మంద జగన్నాథం, జె డ్పీ చైర్పర్సన్ సరిత, మంద శ్రీనాథ్‌తోపాటు అధికసంఖ్యలో తరలొచ్చిన బీఆర్ఎస్ శ్రేణులతో ఎ మ్మెల్యే మాట్లాడారు. తెలంగాణలో తమ నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో 60లక్షల మంది బీఆర్ఎస్ కుటుంబసభ్యులతో బలీయమైన శక్తిగా ఉన్నదన్నారు. సమస్యలేమైనా ఉంటే సామరస్యంతో పరిష్కరించుకొని ముందుకు సా గుదామన్నారు.
సీఎం కేసీఆర్ రైతు శ్రేయస్సు కోసం సాగునీరు, ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, ఎరువులు, విత్తనాల పంపిణీ, ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ పక్క రాష్ర్టాల రైతుల మనుసును సైతం దోచుకున్నాడన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మాకూ కావాలంటూ తమ ప్రభుత్వాలను ప్రజలు నిలదీస్తున్నారన్నా రు. రైతుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంటే.. కేంద్రం మాత్రం నల్లచట్టాలను అమలుచేస్తూ వ్యవసాయ రంగాన్ని కుదేలు చేయడానికి పూనుకొందన్నారు. ఉద్యమం చేస్తున్న రైతులకు కేసీఆర్ అండగా నిలిచి నల్లచట్టాలను రద్దు చేసేందుకు కృషి చేశాడన్నారు. గ్యాస్ ధర పెం చడం, కోటి ఉద్యోగాలంటూ నిరుద్యోగులను కేం ద్రం మోసంచేసిందన్నారు. ఇలా అన్ని రంగాల్లో విఫలమైన బీజేపీ ప్రభుత్వంలో దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని.. అచ్చేదిన్ కాదు సచ్చేదిన్ వచ్చిందన్నారు.
అనంతరం మంద జగన్నాథం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయన్నారు. మండలంలో జరిగే ఆ త్మీయ సమ్మేళనాలకు జెడ్పీటీసీ, ఎంపీపీలు ఎం దుకు హాజరవడం లేదని ప్రశ్నించారు. అందుకు గల కారణాలను గుర్తించి సరిదిద్దే ప్రయత్నం చే యాలన్నారు. జెడ్పీ చైర్పర్సన్ సరిత మాట్లాడు తూ.. అలంపూర్‌లో బీఆర్ఎస్కు తిరుగులేదన్నా రు. మహిళలు ఆత్మీయ సమ్మేళనానికి ఉత్సాహం గా రావడం సంతోషమన్నారు. అందరం కలిసికట్టుగా ఉంటూ గులాబీ జెండాను రెపరెపలాడించేందుకు కృషి చేద్దామన్నారు. గెలుపు కోసం, మె జార్టీ కోసం పని చేద్దామన్నారు. మంద శ్రీనాథ్ మాట్లాడుతూ.. ఇతర పార్టీలను ఆదరిస్తే రాష్ట్రం లో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆగిపోతాయన్నారు. అందరూ ఏకతాటిపై నడిచి బీఆర్ఎస్కు మళీ ్ల అధికారం కట్టబెట్టాలని పిలుపునిచ్చారు.
అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ అరాచక శక్తులను అంతమొందించే సమయం ఆసన్నమైందన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లెప్రగతి, పట్టణప్రగతి వల్లే నేడు క్షేత్రస్థాయిలో అభివృద్ధి సాధ్యమైందన్నారు. అబద్ధాల బీజేపీకి అవకాశం ఇస్తే దేశాన్నే అమ్మేస్తుందని ఆరోపించారు. సమ్మేళనంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి, సర్పంచ్ వీరన్న, నాయకులు తనగల సీతారామిరెడ్డి, గిడ్డారెడ్డి, మధునాయుడు, భాస్కర్‌రెడ్డి, సీపీఎం ఆంజనేయులు, గుమ్మ గోవర్ధన్, జెడ్పీటీసీ రాజు, శివుడు, నీలి శ్రీను, వేణుగోపాల్‌నాయుడు, శ్రీనివాస్‌రెడ్డి, వీరన్న, రామిరెడ్డి, సుంకన్న, రాగన్న, దుబ్బన్న, మన్యంగౌడ్, కళాకారుల బృందం, మహిళలు పాల్గొన్నారు.