ఉత్తరాఖండ్‌లో రేపటి నుంచి కర్ఫ్యూ
ఉత్తరాఖండ్‌లో రేపటి నుంచి కర్ఫ్యూ | దేశాన్ని కరోనా వణికిస్తోంది. మహమ్మారి ఉధృతికి ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్డౌన్ బాట పట్టగా.. మరిన్ని పాక్షిక లాక్డౌన్ అమలు చేస్తున్నాయి.

డెహ్రాడూన్ : దేశాన్ని కరోనా వణికిస్తోంది. మహమ్మారి ఉధృతికి ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్డౌన్ బాట పట్టగా.. మరిన్ని పాక్షిక లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. మరోకొన్ని రాష్ట్రాలు నైట్‌కర్ఫ్యూను అమలు చేస్తున్నాయి. పెరుగుతూ వస్తున్న కేసుల మధ్య ఉత్తరాఖండ్ ప్రభుత్వం సైతం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 11 నుంచి 18వ తేదీ వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు పేర్కొంది. మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు కేబినెట్ మంత్రి సుబోధ్ యునియల్ తెలిపారు. కర్ఫ్యూ సమయంలో పాలు, కూరగాయలు, పండ్లు, మాంసం తదితర అత్యవసర దుకాణాలను ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
కిరాణ దుకాణాలు ఈ నెల 13న తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. షాపింగ్ మాల్స్, మార్కెట్ కాంప్లెక్స్, జిమ్‌లు, థియేటర్లు, అసెంబ్లీ హాళ్లు, మద్యం దుకాణాలు, బార్లు తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు మూసే ఉంటాయని తెలిపింది. కర్ఫ్యూ సమయంలో ఐడీకార్డులు ఉన్న మీడియా వ్యక్తులకు బయట తిరిగేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతర్రాష్ట్ర ప్రయాణికులు తప్పనిసరిగా 72 గంటలకు మించకుండా ఆర్టీ పీసీఆర్ నెగెటివ్ రిపోర్టును ఇవ్వాల్సి ఉంటుందని, అలాగే డెహ్రాడూన్ పరిపాలన పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఉత్తరాఖండ్ ప్రజలు వారం రోజులు క్వారంటైన్లో ఉండాలని సూచించింది.
అత్యవసర సేవలు అందించే విభాగాల్లో కేవలం 50 శాతం మంది మాత్రమే హాజరవుతారని పేర్కొంది. వీలైతే వివాహాలను వాయిదా వేసుకోవాలని ప్రభుత్వం ప్రజలకు సూచించింది. కర్ఫ్యూ సమయంలో కేవలం వివాహలు, అంత్యక్రియల్లో 20 మందికి మించకుండా నిర్వహించాలని ఆదేశించింది. టీకాలు వేసుకునే వారికి సైతం ప్రభుత్వం ఆంక్షల నుంచి మినహాయింపులు, అయితే రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరిగా చూపించాలని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. నిన్న ఉత్తరాఖండ్‌లో 5,890 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. 180 మంది చెందారు. 2,791 మంది కోలుకున్నారని ఉత్తరాఖండ్ ఆరోగ్యశాఖ తెలిపింది.
ఇవి కూడా చదవండి..
ఈ లక్షణాలు ఉంటే బ్లాక్ ఫంగస్
పుదుచ్చేరి ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్
అమెరికాలో కాల్పుల కలకలం.. రెండు ఘటనల్లో 11 మంది మృతి
అసోం సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న హిమంత
నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ.. ఎన్నికల ఫలితాలపై మేథోమధనం
వాహనాదరులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
హర్యానాలో మరో వారం లాక్డౌన్ పొడగింపు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
నీళ్లులేక ఎండిన పంటలు.. జయశంకర్ జిల్లాలో యువరైతు వినూత్న నిరసన : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

