iPhone : ఐఫోన్ వాడుతున్న యూజర్లకు యాపిల్ సంస్థ కీలక హెచ్చరిక జారీ చేసింది. తమ ఫోన్లను వెంటనే అప్డేట్ చేసుకోవాలని సూచించింది. లేకుంటే ఫోన్లు హ్యాకింగ్ కు గురయ్యే అవకాశం ఉందని తెలిపింది. సాధారణంగా ఐ ఫోన్లలో సైబర్ సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది అనుకుంటారు. అయినప్పటికీ.. ఈ ఫోన్లను హ్యాక్ చేసే అవకాశం ఉంది.
ఇందులోని కొన్ని లోపాల ఆధారంగా హ్యాక్ చేయొచ్చని యాపిల్ తయారీదారులు అంటున్నారు. వెబ్ కిట్ ద్వారా హ్యాకర్లు ఐ ఫోన్లలోకి చొరబడే అవకాశం ఉంది. ఇది సఫారీ వంటి బ్రౌజర్లు, యాప్స్ వాడేందుకు ఉపయ్గోపడుతుంది. కానీ, దీని ద్వారా బగ్స్ ఫోన్లలోకి చొరబడొచ్చని ఐఫోన్ మేకర్స్ అంటున్నారు. ఇప్పటికే కొందరు దీని ప్రభావానికి గురైనట్లు చెబుతున్నారు. అందుకే సైబర్ మోసాలకు గురి కాకూడదనుకుంటే.. డాటా చోరీ కాకూడదనుకుంటే.. వెంటనే తమ ఐఫోన్లు అప్డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. తాజా బగ్ వల్ల ఐఫోన్లు ఈజీగానే హ్యాకింగ్ కు గురయ్యే ఛాన్స్ ఉంది. అంటే.. యూజర్లు ఏ వెబ్ లింక్ క్లిక్ చేయకున్నా, లేదా ఏ యాప్ ఇన్ స్టాల్ చేయకున్నా సరే హ్యాకింగ్ కు గురవ్వొచ్చు. ఐఓఎస్ తోపాటు, ఐప్యాడ్ ఓఎస్ వాడేవారికి కూడా ఈ ముప్పుపొంచి ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే ఫోన్లను, ఐప్యాడ్లను అప్డేట్ చేసుకోవడం ఉత్తమం.